Weight Loss:బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Weight Loss:బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఈ మధ్య కాలంలో చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది జిమ్ కి పరుగులు పెడితే కొంతమంది తిండి తినడం మానేస్తున్నారు. ఎలా చేసినా మార్పు కనిపించడం లేదు. ఇప్పుడు చెప్పే అలవాటులను చేసుకుంటే 30 రోజుల్లోనే మీకు తేడా కనపడుతుంది.
రాత్రి సమయంలో భోజనం చాలా ఆలస్యంగా తింటూ ఉంటారు. ఇది బరువు తగ్గటానికి పెద్ద అడ్డంకిగా ఉంటుంది. ఆలస్యంగా భోజనం చేయడం వలన తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దాంతో రాత్రి పడుకునే సమయంలో శరీరంలో జీవక్రియ రేటు తగ్గి కేలరీలు కరగకుండా కొవ్వుగా మారిపోతాయి. కాబట్టి రాత్రి 7 గంటల్లోపు భోజనం చేయాలి. లేదంటే రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు కచ్చితంగా భోజనం చేయాలి.
చాలామంది రాత్రి సమయంలో ఎక్కువ క్యాలరీలు, కొవ్వు ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఇవి బరువు పెరగటానికి దారి తీస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం. అందుకే ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులును రాత్రి భోజనంలో చేర్చుకోవడం మంచిది. అది కూడా మితంగానే తినాలి.
బరువు తగ్గడానికి నిద్ర కూడా ముఖ్యమే. నిద్రలేమి కారణంగా హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఆకలి పెంచే హార్మోన్లు యాక్టివేట్ అయ్యి ఎక్కువగా తినడాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే పడుకోవటానికి ముందు ఒక గంట ముందు మొబైల్, ఫోన్, టీవీ చూడటం మానేస్తే మంచిది.
భోజనం చేసిన తర్వాత కూడా ఆకలి అనిపిస్తే చాలామంది చిప్స్, బిస్కెట్స్, స్వీట్స్ వంటివి తింటూ ఉంటారు. అలా కాకుండా పండ్లు, నట్స్, పెరుగు వంటి వాటిని తింటే సరిపోతుంది.
రాత్రి భోజనం చేసిన తర్వాత పది నుంచి 15 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

