Tomato Karivepaku Pachadi:టమాటో కరివేపాకు పచ్చడి..ఇలా చేసి వేడి వేడి అన్నంలోకి వెన్నపూసతో తింటే ఉంటుందీ
Tomato Karivepaku Pachadi :టమోటా మరియు కరివేపాకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి పచ్చడి తయారుచేసుకుందాం. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తింటే అసలు వదిలిపెట్టరు.
కావాల్సిన పదార్థాలు
– నూనె: 2 టీస్పూన్లు
– నువ్వులు: 2 టీస్పూన్లు
– పచ్చికొబ్బరి తురుము: ½ కప్పు
– పచ్చిమిర్చి: 10-15
– కరివేపాకు: 75 గ్రాములు
– టమాటాలు: 300 గ్రాములు
– ఉప్పు: రుచికి సరిపడా
తాళింపు కోసం
– నూనె: 1 టీస్పూన్
– తాళింపు దినుసులు: తగినంత
– ఎండుమిర్చి: 1-2
– కరివేపాకు: కొద్దిగా
తయారీ విధానం: స్టవ్ వెలిగించి కళాయి వేడి చేసి 2 టీస్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఆ తర్వాత నువ్వులు వేసి మంచి వాసన వచ్చేలా వేయించి,ఆ తర్వాత పచ్చికొబ్బరి తురుము వేసి వేయించండి.ఆ తర్వాత పచ్చి మిర్చి వేసి మగ్గించి, కరివేపాకు వేసి వేయించండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని ప్లేటులోకి తీసుకోవాలి.
అదే కళాయిలో 1 టీస్పూన్ నూనె వేసి, టమాటా ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా మగ్గించండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.మిక్సీ జార్లో ముందుగా వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.aఆ తర్వాత చల్లారిన టమాటా ముక్కలు వేసి మళ్లీ గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోండి.
తాళింపు కోసం కళాయిలో 1 టీస్పూన్ నూనె వేసి, తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. తాళింపును పచ్చడిలో వేసి కలపండి. అంతే ఎంతో రుచికరమైన టమాటా కరివేపాకు పచ్చడి సిద్ధం.. సర్వ్ చేయండి. ఇది అన్నం,దోశ, ఇడ్లీ.. ఇలా న్నిన్తిలోకి బాగుంటుంది. టమోటా మరియు కరివేపాకులో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

