Healthhealth tips in telugu

Jackfruit health benefits:వేసవిలో దొరికే ఈ పండు.. ఒక వరం ఎందుకో తెలుసా..?

Jackfruit health benefits:వేసవిలో దొరికే ఈ పండు.. ఒక వరం ఎందుకో తెలుసా.. వేసవి కాలంలో పనసపండు చాలా విరివిగా లభ్యమవుతుంది. ఈ పండు మార్చి నుంచి జూన్ వరకు చాలా ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు.

ఈ పండులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఈ పండు ఒక వరం అని చెప్పవచ్చు. దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి శరీరంలో తగినంత రక్తప్రసరణకు సహాయపడి రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తుంది.

అలాగే ఎముకల దృఢత్వానికి సహాయపడే కాల్షియం, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన ఈ సీజన్లో తప్పనిసరిగా ఈ పండును తినాలి. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తగ్గిస్తుంది. విటమిన్ సి ఉండటం వలన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

కార్బోహైడ్రేడ్లు, సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉండటం వలన ఈ పండు తిన్న వెంటనే తక్షణ శక్తి లభిస్తుంది. పనసపండు వేడిని ఉత్పత్తి చేసే స్వభావం ఉండటం వలన మితంగా తింటే మంచిది. ఎక్కువగా తింటే అజీర్ణం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ పండులో తీపి ఎక్కువగా ఉండటం వలన డయాబెటిస్ ఉన్నవారు లిమిట్ గా తింటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ