Healthhealth tips in telugu

Joint Pains:మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆయిల్ వెంటనే తయారు చేసుకోండి

Joint Pains:మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆయిల్ వెంటనే తయారు చేసుకోండి. మోకాలు నొప్పులు అనేవి ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పటి రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా చిన్న వయసులోనే అంటే 30 ఏళ్ళు వచ్చేసరికి మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి.

ఎక్కువసేపు నిలబడలేక పోవటం, మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఆయిల్ ని ఉపయోగిస్తే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో ఒక కప్పు నువ్వుల నూనె, 10 నుంచి 15 పొట్టు తొలగించి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఐదు నిమిషాలు పాటు వేయించాలి.

ఆ తర్వాత దానిలో అర టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసి మరో రెండు నిమిషాల పాటు వేగించి పొయ్యి ఆఫ్ చేయాలి. కాస్త వేడి తగ్గాక స్ట్రైనర్ సహాయంతో ఈ ఆయిల్ ని ఫిల్టర్ చేసి చల్లారబెట్టి ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనె నొప్పులు ఉన్న ప్రదేశంలో సున్నితంగా రాసి మసాజ్ చేసుకుంటే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.

రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే ఉదయం లేచేసరికి మంచి ఉపశమనం ఉంటుంది. లేదంటే స్నానం చేయటానికి రెండు గంటల ముందు కూడా ఈ విధంగా నూనె రాసుకుని మసాజ్ చేయవచ్చు. ఇది నాచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. ఈ నూనెను వాడటం వలన రక్త ప్రసరణ మెరుగుపడి వాపు తగ్గి నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. మోకాలు నొప్పులు ఉన్నవారికి ఈ నూనె చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ