Kitchenvantalu

Beans Fry Recipe:బీన్స్ ఫ్రై రుచిగా రావాలంటే ఇలా చేయండి రైస్, చపాతీ, రసం సాంబారు లోకి బావుంటుంది

Beans Fry Recipe:బీన్స్ ఫ్రై రుచిగా రావాలంటే ఇలా చేయండి రైస్, చపాతీ, రసం సాంబారు లోకి బావుంటుంది.. ఈ సీజన్ లో బీన్స్ విరివిగా లభ్యం అవుతాయి. వీటిలో ఎన్నో పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయి. ఇక బీన్స్ వేపుడు ఎలా చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
– చిన్నగా తరిగిన బీన్స్: 250 గ్రా.
– పసుపు: 1/4 టీస్పూన్
– ఉప్పు: రుచికి సరిపడా
– నీళ్లు: 1/4 కప్పు
– నానబెట్టిన శనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు
– ఎండుమిర్చి: 6
– జీలకర్ర: 1 టీస్పూన్
– నూనె: 1 టేబుల్ స్పూన్
– తాళింపు దినుసులు: 1 టేబుల్ స్పూన్
– కరివేపాకు: 1 రెమ్మ
– పచ్చికొబ్బరి తురుము: 1/4 కప్పు
– తరిగిన కొత్తమీర: కొద్దిగా

తయారీ విధానం:
మిక్సీ జార్‌లో నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేయండి.మూకుడులో బీన్స్, పసుపు, ఉప్పు వేసి కలపండి. నీళ్లు పోసి, మూతపెట్టి బీన్స్ మెత్తగా ఉడికే వరకు ఉడికించండి.మూత తీసి, నీరు ఆవిరైపోయే వరకు వేయించి, బీన్స్‌ను పక్కన పెట్టండి.

ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించండి. గ్రైండ్ చేసిన శనగపప్పు మిశ్రమం వేసి, ఉడికించిన బీన్స్ వేసి బాగా కలపండి.మూతపెట్టి మరో 2 నిమిషాలు వేయించండి. పచ్చికొబ్బరి తురుము, కొత్తమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.రుచికరమైన బీన్స్ ఫ్రై సిద్ధం!

ఈ fry చాలా బాగుంటుంది. వేసవిలో ఏ కూరలు తినాలని అనిపించదు. కానీ ఈ fry ఇలా చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు. కాబట్టి ఒకసారి ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ