Kitchenvantalu

Ice apple sharbat recipe:కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే తాటిముంజుల షర్బత్

Ice apple sharbat recipe:మండు వేసవిలో చల్లదనం అందించే “తాటి ముంజల షర్బత్” – కేవలం రెండు నిమిషాల్లో సిద్ధం.. తాటి ముంజలతో ఈ షర్బత్‌ను ఒకసారి ప్రయత్నించండి. రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడమే కాక, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడతారు. ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన తాటి ముంజల షర్బత్‌ను ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
– సబ్జా గింజలు – 1 టేబుల్ స్పూన్
– తాటి ముంజలు – 6
– నన్నారి షర్బత్ – అర కప్పు
– ఐస్ క్యూబ్స్ – అవసరమైనన్ని
– చల్లటి నీరు – 750 ml
– నిమ్మకాయ – 1

తయారీ విధానం:
ముందుగా తాటి ముంజలను చల్లటి నీటిలో 2 నిమిషాలు నానబెట్టి, పొట్టు తీసి పక్కన ఉంచండి. నీటిలో నానబెట్టడం వల్ల పొట్టు సులభంగా వస్తుంది. ఒక గిన్నెలో సబ్జా గింజలను తీసుకుని తగినంత నీటిలో నానబెట్టండి.

మిక్సీ జార్‌లో 3 ఐస్ క్యూబ్స్, తాటి ముంజలు, నన్నారి షర్బత్ వేసి, హై స్పీడ్‌లో మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేయండి. ఇలా చేయడం వల్ల షర్బత్ తాగేటప్పుడు తాటి ముంజల రుచి బాగా తెలుస్తుంది.

పెద్ద గిన్నెలో ఐస్ క్యూబ్స్, తాటి ముంజల పేస్ట్, చల్లటి నీరు, నిమ్మరసం వేసి బాగా కలపండి. చివరగా నానబెట్టిన సబ్జా గింజలు వేసి మరోసారి కలిపితే తాటి ముంజల షర్బత్ సిద్ధం!

సర్వింగ్ కోసం గ్లాస్‌లో షర్బత్ పోసి, రెండు ఐస్ క్యూబ్స్, సన్నగా తరిగిన తాటి ముంజలు, పుదీనా ఆకులతో అలంకరిస్తే రుచితో పాటు చూడ్డానికి కూడా సూపర్‌గా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ