Mango Green Chilli chutney:నోటికి కొత్త ఉతేజాన్నిచ్చే పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి
Mango Green Chilli chutney:నోటికి కొత్త ఉతేజాన్నిచ్చే పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి.. పుల్లని మామిడికాయలు ఇప్పుడు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. కాబట్టి ఒక్కసారి పచ్చడి ఇలా చేసుకొని చూడండి. చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
పచ్చడి కోసం:
– నూనె: 4 టేబుల్ స్పూన్లు
– పచ్చిమిర్చి: 100 గ్రాములు
– వెల్లుల్లి: 20-25 రెబ్బలు
– ఉప్పు: రుచికి సరిపడా
– పుల్లటి మామిడికాయ ముక్కలు: 100 గ్రాములు
– ఉల్లిపాయ: 1 (ముక్కలుగా)
– వేరుశనగ గుండ్లు: 2 టేబుల్ స్పూన్లు
పోపు కోసం:
– నూనె: 2 టేబుల్ స్పూన్లు
– ఆవాలు: 1 టీస్పూన్
– ఎండుమిర్చి: 1
– శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
– మినపప్పు: 1 టీస్పూన్
– జీలకర్ర: 1 టీస్పూన్
– హింగ్ (ఇంగువ): చిటికెడు
– కరివేపాకు: 1 రెమ్మ
– కొత్తిమీర (తరిగినవి): కొద్దిగా
తయారీ విధానం
పొయ్యిపై పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసి పచ్చిమిర్చిని వేసి మగ్గించాలి. వేయించిన పచ్చిమిర్చి, పచ్చి వెల్లుల్లి, ఉప్పును రోటిలో కచ్చాపచ్చాగా దంచండి. ఆ తర్వాత పుల్లటి మామిడికాయ ముక్కలు వేసి మళ్లీ దంచండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వేయించిన వేరుశనగ గుండ్లు వేసి బాగా దంచండి.
పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి ఎర్రగా వేయించండి. చిటికెడు హింగ్, కరివేపాకు వేసి మగ్గించండి. దంచిన పచ్చడిని పోపులో వేసి బాగా కలపండి. 2 నిమిషాలు సన్నని మంటపై కలుపుతూ మగ్గించండి. కొద్దిగా బెల్లం, తరిగిన కొత్తిమీర వేసి కలపండి.
బెల్లం అవసరం అనుకుంటే వేసుకోవచ్చు.. లేదంటే మానేయవచ్చు. కొంత మంది బెల్లంను పచ్చడిలో ఇష్టపడరు. ఈ పచ్చడి 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడి అన్నంతో సర్వ్ చేయండి!
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

