Kitchenvantalu

Kitchen Tips:ప్లాస్టిక్ బాక్సులను ఎప్పుడు మార్చాలో తెలుసా..

Kitchen Tips: ప్లాస్టిక్ బాక్సులను ఎప్పుడు మార్చాలో తెలుసా..ప్లాస్టిక్ బాక్సులు చవకైనవి, తేలికైనవి, ఉపయోగించడానికి సులభమైనవి. దాంతో అందరూ వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు.

కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ప్లాస్టిక్ బాక్సులను ఎక్కువ కాలం ఉపయోగించలేము. కాలక్రమేణా ప్లాస్టిక్ క్షీణించి, దుర్వాసన వస్తుంది, ఆహారాన్ని నిల్వ చేయడానికి వీలుకాదు. పాత ప్లాస్టిక్ బాక్సులను ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెప్పుతున్నారు.

బాక్స్ కు పగులు లేదా వంపులు ఉంటే అవి సరిగా మూత పట్టకపోతే వాటిని మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి.

పాత ప్లాస్టిక్ బాక్సులు పాడవడమే కాకుండా వాటిలో బ్యాక్టీరియా పెరిగి ఆహారాన్ని పాడు చేస్తుంది.

నిలువ చేసిన ఆహారం వాసన, రంగును ప్లాస్టిక్ గ్రహిస్తుంది. దీని అర్థం మనం ప్లాస్టిక్ బాక్సును మార్చేయాలని అర్థం చేసుకోవాలి.

బాక్స్ మూత సరిగ్గా పట్టలేనంతగా కుచించుకుపోయినా లేదా వంగిపోయిన బాక్స్ను తీసేయాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

దాదాపుగా ఐదు సంవత్సరాలు అయిందంటే తప్పనిసరిగా తీసేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ