Tomato Coriander Rice:కేవలం 15 నిమిషాల్లోనే పిల్లలు ఇష్టంగా తినే టమాటా కొత్తిమీర రైస్..
Tomato Coriander Rice:కేవలం 15 నిమిషాల్లోనే పిల్లలు ఇష్టంగా తినే టమాటా కొత్తిమీర రైస్.. ఈ rice ని చుట్టాలు వచ్చినప్పుడు చాలా సులభంగా చేసేయవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. టమోటా,కొత్తిమీర కాంబినేషన్ లో ఈ రైస్ చాలా అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు:
– నూనె – 2 టేబుల్ స్పూన్లు
– దాల్చిన చెక్క – 1 ఇంచు ముక్క
– లవంగాలు – 4
– యాలకులు – 3
– బిర్యానీ ఆకు – 1
– జీలకర్ర – ½ టీ స్పూన్
– దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5
– ఎండుమిర్చి – 2
– పచ్చిమిర్చి – 3
– సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
– కరివేపాకు – 2 రెమ్మలు
– కొత్తిమీర కట్ట – 1
– పెద్ద టమాటాలు – 2
– ఉప్పు – తగినంత
– పసుపు – ½ టీ స్పూన్
– ధనియాల పొడి – 1 టీ స్పూన్
– అన్నం – 2 కప్పులు
– తరిగిన కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం:
టమాటా కొత్తిమీర రైస్ తయారీ కోసం ముందుగా కొత్తిమీరను పేస్ట్‌గా చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి వేడి చేయాలి. మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
ఆ తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కొత్తిమీర పేస్ట్ వేసి, నూనె పైకి తేలే వరకు వేయించాలి. టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి.
మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట మెత్తబడ్డాక ధనియాల పొడి వేసి కలపాలి. అనంతరం అన్నం వేసి అంతా సమానంగా కలిసేలా కలపాలి. మూత పెట్టి 2 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించి, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. రైతాతో సర్వ్ చేస్తే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది.
కాబట్టి ఒకసరి ట్రై చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది,
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

