Kitchen Tips: వంటగది గోడపై నూనె మరకలు అవుతున్నాయా? ఈ చిట్కాలతో జిడ్డు మటుమాయం
Kitchen Tips: వంటగది గోడపై నూనె మరకలు అవుతున్నాయా? ఈ చిట్కాలతో జిడ్డు మటుమాయం.. మహిళలు రోజులో ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు వంట చేస్తూ సమయం గడిచిపోతుంది. అయితే, వంట సమయంలో గోడలపై నూనె మరకలు పడటం సాధారణం.
వంటకాల వల్ల గోడలపై నూనె, ధూళి పేరుకుపోతుంది. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఈ మరకలు ఎంత రుద్దినా సులభంగా పోవు, ఎక్కువ సమయం, శ్రమ అవసరం. కానీ, కొన్ని సులభమైన చిట్కాలతో ఈ మరకలను తేలికగా తొలగించవచ్చు. అవేంటో చూద్దాం.
వెనిగర్
ఒక గిన్నెలో అర కప్పు వెనిగర్, కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్ తీసుకుని, ఒక కప్పు వేడి నీటితో కలిపి మిశ్రమం తయారు చేయండి. దీన్ని స్ప్రే బాటిల్‌లో నింపండి. ఈ మిశ్రమాన్ని వంటగది గోడలు, గ్యాస్ స్టవ్‌పై స్ప్రే చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడిస్తే మరకలు తొలగిపోయి గోడలు మెరుస్తాయి.
బేకింగ్ సోడా
నూనె మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. పావు కప్పు బేకింగ్ సోడాకు నీరు కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను మరకలపై రాసి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత నీటిలో తడిచిన శుభ్రమైన గుడ్డతో తుడిస్తే మరకలు సులభంగా పోతాయి.
నిమ్మరసం
వంటగది టైల్స్‌పై నూనె మరకలను తొలగించడానికి నిమ్మరసం చాలా ఉపయోగకరం. ఒక గిన్నెలో కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్, సగం నిమ్మకాయ రసం కలిపండి. ఈ మిశ్రమంలో స్క్రబ్బర్‌ను ముంచి, గోడలను తేలికగా స్క్రబ్ చేయండి. తర్వాత కాటన్ గుడ్డతో తుడిస్తే టైల్స్, సింక్ శుభ్రంగా మెరుస్తాయి.
ఈ సులభమైన చిట్కాలతో వంటగది గోడలు, టైల్స్‌ను తేలికగా శుభ్రం చేయవచ్చు.. మీరు కూడా ఈ చిట్కాలను ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

