Healthhealth tips in telugu

Moringa Leaves water: పరగడుపున మునగాకు నీరు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే!

Moringa Leaves water: పరగడుపున మునగాకు నీరు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే..ఆయుర్వేద నిపుణుల ప్రకారం, మునగ చెట్టు అనేక ఔషధ గుణాలతో నిండిన పోషక శక్తి కేంద్రం. మునగాకు, కాయలు రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. మునగాకు నీళ్ళు రోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

మునగాకులో విటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల జలుబు, దగ్గు, జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది. మునగాకు నీళ్ళు జీవక్రియను పెంచి, ఆకలిని తగ్గించి, బరువు తగ్గడానికి తోడ్పడతాయి.

జీర్ణ సమస్యలైన మలబద్ధకం, విరేచనాలు, గ్యాస్‌లను నివారించడంలో మునగాకు నీళ్ళు చాలా బాగా సహాయపడతాయి. ఇందులోని ఐసోథియోసైనేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. పాలీఫెనాల్స్, టానిన్లు, సాపోనిన్లు వంటి సమ్మేళనాలు రక్తపోటును తగ్గించడంలో తోడ్పడతాయి.

కాబట్టి ప్రతి రోజు ఉదయం పరగడుపున మునగాకు నీటిని తాగటానికి ప్రయత్నం చేయండి. ఒక గిన్నెలో నీటిని పోసి గుప్పెడు మునగాకును వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ