Healthhealth tips in telugu

Cucumber: వేసవిలో దోసకాయ తింటున్నారా? వీటితో మాత్రం కలిపి తినొద్దు..ఎందుకంటే..

Cucumber: వేసవిలో దోసకాయ తింటున్నారా? వీటితో మాత్రం కలిపి తినొద్దు..ఎందుకంటే.. వేసవికాలంలో తప్పనిసరిగా తినాల్సిన ఆహారంలో దోసకాయ ఒకటి. ఎక్కువగా సలాడ్లు ,రైతాలో ఉపయోగిస్తారు, ఇది అధిక నీటి కంటెంట్ కారణంగా మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కానీ, దోసకాయతో ఏయే ఆహార పదార్థాలను కలిపి తినకూడదో ఇక్కడ చూద్దాం.

దోసకాయ పెరుగు కలిపి తినకూడదు.. ఎందుకంటే దోసకాయ, పెరుగు రెండు చల్లని గుణాలు కలిగి ఉండటం వలన జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది.

దోసకాయ, టమాట కూడా కలిపి తినకూడదు.. ఎందుకంటే దోసకాయలో క్షారగుణం.. టమాటలో ఆమ్లగుణం ఉండటం వలన ఈ రెండు కలిస్తే ఆమ్ల..క్షార ప్రతి చర్య జరిగి గ్యాస్, అజీర్ణం సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

దోసకాయ, ఉప్పు, మసాలాలు కలిపి తీసుకోకూడదు.. ఎందుకంటే దోసకాయలో ఉన్న పోషకాలు మన శరీరం గ్రహించకుండా చేస్తుంది. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దోసకాయ తిన్నా వెంటనే నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

దోసకాయను పగటిపూట మాత్రమే తినాలి. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం తర్వాత తింటే మంచిది. ఉదయం పరగడుపున దోసకాయ తింటే మలబద్దకం తగ్గుతుంది. దోసకాయను కొన్నా వెంటనే శుభ్రమైన నీటితో శుభ్రంగా కడగాలి. ఎందుకంటే దాని మీద ఉన్న రసాయనాలు, మైనం తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ