Bottle Gourd Idli Recipe:ఆరోగ్యకరమైన అల్పాహారం తినాలనుకుంటే.. సోరకాయ ఇడ్లీ ట్రై చేయండి..
Bottle Gourd Idli Recipe:ఆరోగ్యకరమైన అల్పాహారం తినాలనుకుంటే.. సోరకాయ ఇడ్లీ ట్రై చేయండి.. సొరకాయతో నానబెట్టకుండా త్వరగా మెత్తని ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ విధానంలో సొరకాయ తురుము ఉపయోగించి ఇడ్లీలు మృదువుగా, రుచిగా వస్తాయి.
కావాల్సిన పదార్థాలు
– చిన్న సొరకాయ – 1
– బొంబాయి రవ్వ – 1 కప్పు
– పెరుగు – ½ కప్పు
– ఉప్పు – రుచికి సరిపడా
– వంట సోడా – ¼ టీస్పూన్
తాలింపు కోసం
– నూనె – 2 టేబుల్ స్పూన్లు
– పచ్చి శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
– మినపప్పు – 1 టేబుల్ స్పూన్
– ఆవాలు – ½ టీస్పూన్
– జీలకర్ర – ½ టీస్పూన్
– కరివేపాకు – 2 రెమ్మలు
తయారీ విధానం
సొరకాయను కడిగి, ముక్కలుగా కట్ చేసి, గుజ్జు తీసేసి, గ్రేటర్‌తో తురుముకోండి. తురిమిన సొరకాయను ఒక గిన్నెలో పక్కన పెట్టండి. ఒక పాత్రలో 1 కప్పు బొంబాయి రవ్వ, ½ కప్పు పెరుగు, 1 కప్పు సొరకాయ తురుము, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలపండి.
ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు నాననివ్వండి. తర్వాత మళ్లీ కలిపి, రుచికి సరిపడా ఉప్పు, ¼ టీస్పూన్ వంట సోడా, కొంచెం నీళ్లు జోడించి మెత్తగా కలపండి. తాలింపు కోసం, కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అందులో పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఈ తాలింపును ఇడ్లీ పిండిలో వేసి కలపండి.
ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడి చేయండి. ఇడ్లీ ప్లేట్లకు నూనె లేదా నెయ్యి రాసి, పిండిని సమానంగా పోసుకోండి. ఇడ్లీ పాత్రలో ప్లేట్లను ఉంచి, 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించండి. స్టవ్ ఆపి, 5 నిమిషాల తర్వాత ఇడ్లీలను తీసి, వేడిగా సర్వ్ చేయండి.
ఈ సొరకాయ ఇడ్లీలు పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీతో అద్భుతంగా ఉంటాయి. ఈ సులభమైన రెసిపీని ఒకసారి ప్రయత్నించండి!
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

