Healthhealth tips in telugu

Chia Seeds: 30 రోజులు చియా సీడ్స్‌ తింటే ఏమి అవుతుందో తెలుసా..?

chia seeds benefits:చియా సీడ్స్‌.. ఇటీవలి కాలంలో బరువు తగ్గించే ఆహారంగా విశేష ప్రజాదరణ పొందిన సూపర్‌ఫుడ్‌. చిన్నగా, నల్లని రంగులో ఉండే ఈ గింజలు పోషకాల సమృద్ధిగా పిలవబడతాయి. చియా సీడ్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌, కొవ్వులను సమృద్ధిగా అందిస్తాయి.

వీటిలో విటమిన్‌ ఏ, బి, ఇ, డి, నియాసిన్‌, థియామిన్‌తో పాటు కాల్షియం, పొటాసియం, ఫాస్పరస్‌, కాపర్‌, జింక్‌, మాంగనీస్‌, ఐరన్‌, అయోడిన్‌, సల్ఫర్‌ వంటి ఖనిజాలు ఉంటాయి. చియా సీడ్స్‌లోని సహజ ఫినాలిక్‌ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్‌ చర్మ వ్యాధుల నుంచి రక్షించి, చర్మాన్ని మరమ్మతు చేస్తూ ముడతలను నివారిస్తాయి.

చియా సీడ్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. వీటిలోని ఫైబర్‌ త్వరగా కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని నియంత్రిస్తుంది, దీనివల్ల శరీర బరువు క్రమంగా తగ్గుతుంది. ఈ ఫైబర్‌ జీర్ణ వ్యవస్థలో ఉపయోగకర బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చియా సీడ్స్‌లోని లినోలెనిక్‌ యాసిడ్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ వంటి కొవ్వు ఆమ్లాలు విటమిన్లు (ఏ, డి, ఇ, కె) శరీరంలో సమర్థవంతంగా శోషించబడేలా సహాయపడతాయి.

చియా సీడ్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ సాల్మన్‌ చేపల కంటే ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును, అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. వీటిలోని ఆల్ఫా-లిపోయిక్‌ యాసిడ్‌ స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు ఉపకరిస్తుంది. అలాగే, జీవక్రియను పెంచడం ద్వారా కడుపు కొవ్వును తగ్గించి, వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

చియా సీడ్స్‌లోని కాల్షియం, బోరాన్‌ ఎముకల బలానికి తోడ్పడతాయి. రోజుకు 1.5 టీస్పూన్ల చియా సీడ్స్‌ను అరకప్పు నీటిలో 2 గంటలు నానబెట్టి, ఆహారంతో తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది. చియా సీడ్స్‌ను పాలు, బియ్యం మిశ్రమంతో కలిపి తీసుకోవడం వల్ల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పాలతో వండిన అన్నం నియమితంగా తీసుకోవడం శరీరానికి బహుళ ప్రయోజనాలను అందిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ