Walking:గులకరాళ్లపై వాకింగ్ చేస్తే ఎని లాభాలో తెలుసా..
Walking On pebble stones:ఈ రోజుల్లో ప్రజలు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. మంచి ఆహారం, వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకుంటున్నారు. రోగాల నుంచి కాపాడుకోవడానికి చాలా మంది వాకింగ్, జిమ్లో వర్కౌట్లు చేస్తున్నారు.
వాకింగ్లో కొందరు వేగంగా, మరికొందరు నెమ్మదిగా నడుస్తారు. కొందరు చెమటలు పట్టేలా నడిస్తే, మరికొందరు అలసట లేకుండా నడుస్తారు. కొందరు చెప్పులు లేదా షూస్ వేసుకుంటే, ఇతరులు బేర్ఫుట్గా నడుస్తారు. ప్రతి వాకింగ్ పద్ధతికి దాని సొంత ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, గులకరాళ్లపై నడవడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసా?
గులకరాళ్లపై చెప్పులు లేకుండా నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, శరీరంలోని విషాలను తొలగిస్తుంది. ఇది సాధారణ వ్యాయామంలా పనిచేస్తుంది. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వృద్ధులలో రక్తపోటును తగ్గిస్తుంది. బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది.
బేర్ఫుట్గా గులకరాళ్లపై నడవడం వల్ల పాదాల్లోని నాడీ కేంద్రాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ మెరుగవుతుంది. పాదాలు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది, పేగు కదలికలు సాఫీగా సాగుతాయి, రుమాటిక్ వ్యాధులు నివారించబడతాయి. ఇది ఖర్చు లేని, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి వైద్యంలా పనిచేస్తుంది.
కాబట్టి, అందుబాటులో ఉన్నవారు రోజూ 10 నిమిషాల పాటు గులకరాళ్లపై నడవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

