BusinessHealthhealth tips in telugu

Ayushman Bharat Card: ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు రాలేదా..? ఇంటి నుంచే ఇలా అప్లై చేసుకోండి..!

Ayushman Bharat Card: ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు రాలేదా..? ఇంటి నుంచే ఇలా అప్లై చేసుకోండి..కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల కుటుంబాల ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకం కింద దేశంలోని అన్ని ఎంప్యానెల్డ్ కార్పోరేట్ ఆసుపత్రులలో లబ్ధిదారులు నగదు రహిత చికిత్స పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డు పొందడానికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. ఈ కార్డు కోసం అర్హతలు, రిజిస్ట్రేషన్ విధానం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుష్మాన్ భారత్ కార్డుకు అర్హతలు
ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) కింద జారీ చేయబడుతుంది. ఈ పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తుంది.
– వయస్సుతో సంబంధం లేకుండా కుటుంబంలోని అన్ని సభ్యులు ఈ రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీకి అర్హులు.
– గ్రామీణ మరియు పట్టణ కుటుంబాలు ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
– దేశంలోని అన్ని ఎంప్యానెల్డ్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంటుంది.
– సీనియర్ సిటిజన్లు అదనంగా రూ. 5 లక్షల వరకు టాప్-అప్ కవరేజీకి అర్హులు.

ఆయుష్మాన్ కార్డు కోసం అవసరమైన డాక్యుమెంట్లు
ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆధార్ నంబర్ ప్రధాన డాక్యుమెంట్‌గా అవసరం.

ఆయుష్మాన్ కార్డు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ స్టెప్-బై-స్టెప్ గైడ్
1. ముందుగా PMJAY అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
2. టాప్ మెనూలో “Am I Eligible” బటన్‌పై క్లిక్ చేయండి.
3. కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, లాగిన్ బటన్‌ను నొక్కండి.
4. రాష్ట్రం, జిల్లా వంటి సంబంధిత వివరాలను నమోదు చేసి, “ఓకే” బటన్‌పై క్లిక్ చేయండి.
5. “Do e-KYC” బటన్‌పై క్లిక్ చేయండి.
6. “Aadhaar OTP” ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్‌ను వెరిఫై చేయండి.
7. మీ మొబైల్‌కు వచ్చే OTPని నమోదు చేసి, “ఓకే” నొక్కండి.
8. 15-20 నిమిషాల తర్వాత మళ్లీ లాగిన్ అయి చూస్తే, “డౌన్‌లోడ్ కార్డు” బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ ఆయుష్మాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.