Washing Machine cleaning:వాషింగ్ మెషీన్ దుర్వాసన వస్తుందా.. అయితే ఇలా క్లిన్ చేస్తే సరి..
Washing Machine:వాషింగ్ మెషీన్ దుర్వాసన వస్తుందా.. అయితే ఇలా క్లిన్ చేస్తే సరి.. వాషింగ్ మెషీన్‌ను ఎక్కువ కాలం పనిచేసేలా ఉంచాలంటే, బట్టలు శుభ్రంగా ఉతకాలంటే, దాన్ని తప్పనిసరిగా క్లీన్ చేయాలి.
మార్కెట్‌లో దీనికోసం ప్రత్యేక పౌడర్‌లు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటి అవసరం లేకుండా, ఇంట్లోనే సులభంగా అందుబాటులో ఉండే పదార్థాలతో వాషింగ్ మెషీన్‌ను డీప్ క్లీన్ చేయవచ్చు. ఈ ప్రక్రియ సులభమైనది మరియు ఎక్కువ శ్రమ లేకుండా పూర్తి చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
ఎందుకు క్లీన్ చేయాలి?
వాషింగ్ మెషీన్‌ను ఎప్పటికప్పుడు డీప్ క్లీన్ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే, మురికి, డిటర్జెంట్ మరకలు, తేమ వల్ల జిగురు లాంటి పొరలు ఏర్పడి మెషీన్ పాడయ్యే ప్రమాదం ఉంది. ఇది బట్టలను సరిగ్గా శుభ్రం చేయకపోవడమే కాక, దుర్వాసన కూడా వస్తుంది.
దుర్వాసన వస్తే, డీప్ క్లీన్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. కనీసం రెండు లేదా మూడు నెలలకు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేస్తే, మెషీన్ ఎక్కువ కాలం పనిచేస్తుంది, బట్టలు కూడా శుభ్రంగా ఉంటాయి.
కావాల్సిన పదార్థాలు
డీప్ క్లీన్ కోసం ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో సులభంగా లభించే వస్తువులతోనే ఈ పని చేయవచ్చు. అవి:
– వైట్ వెనిగర్: డిటర్జెంట్ మరకలను తొలగిస్తుంది, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
– బేకింగ్ సోడా: దుర్వాసనను పోగొడుతుంది, జిగురు లాంటి పదార్థాలను తొలగిస్తుంది.
– బ్లీచ్: మెషీన్‌ను పూర్తిగా శుభ్రం చేస్తుంది.
– సాఫ్ట్ క్లాత్, టూత్ బ్రష్: మూలలు, చేరని ప్రదేశాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడతాయి.
క్లీనింగ్ ప్రక్రియ
ఫ్రంట్ లోడ్ మెషీన్ కోసం:
1. వెనిగర్‌తో క్లీనింగ్: డిటర్జెంట్ డిస్పెన్సర్‌లో 2 కప్పుల వైట్ వెనిగర్ పోసి, హాట్ వాష్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. బట్టలు లేకుండా ఖాళీగా రన్ చేయండి. వేడి నీళ్లతో మురికి కొంత వదులుతుంది.
2. బేకింగ్ సోడాతో క్లీనింగ్: హాట్ వాష్ పూర్తయిన తర్వాత, డ్రమ్‌లో అర కప్పు బేకింగ్ సోడా వేసి మరోసారి హాట్ వాష్ రన్ చేయండి. ఇది డ్రమ్‌ను పూర్తిగా శుభ్రం చేస్తుంది.
3. పైనల్ టచ్: రబ్బర్ సీల్, డిటర్జెంట్ డిస్పెన్సర్‌ను బ్లీచ్‌తో సాఫ్ట్ క్లాత్ లేదా టూత్ బ్రష్‌తో తుడవండి. మెషీన్‌లో తడి ఆరిపోయే వరకు తలుపు తెరిచి ఉంచండి.
టాప్ లోడ్ మెషీన్ కోసం:
1. వెనిగర్‌తో క్లీనింగ్: మెషీన్‌లో వేడి నీటిని నింపి, 4 కప్పుల వైట్ వెనిగర్ వేయండి. గంటపాటు అలాగే ఉంచి, వెనిగర్ నీటిలో కరిగేలా చేయండి. ఆ తర్వాత హాట్ వాష్ రన్ చేయండి.
2. బేకింగ్ సోడాతో క్లీనింగ్: హాట్ వాష్ పూర్తయిన తర్వాత, 1 కప్పు బేకింగ్ సోడా వేసి మరోసారి హాట్ వాష్ చేయండి.
3. ఫైనల్ టచ్: మెషీన్ మూత, డ్రమ్‌ను సాఫ్ట్ క్లాత్ లేదా స్క్రబ్‌తో శుభ్రం చేయండి. తడి ఆరిపోయే వరకు మూత తెరిచి ఉంచండి.
ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి?
సాధారణంగా, రెండు నెలలకు ఒకసారి డీప్ క్లీన్ చేయాలి. ఒకవేళ ఇంట్లో ఎక్కువ మంది ఉండి, రోజూ రెండు లేదా మూడు సార్లు మెషీన్ ఉపయోగిస్తే, 45 రోజులకు ఒకసారి క్లీన్ చేయడం మంచిది.
ఈ జాగ్రత్త తీసుకోకపోతే, కొత్త మెషీన్ అయినా త్వరగా పాడవుతుంది, బట్టలు కూడా సరిగ్గా శుభ్రం కావు. కొన్నిసార్లు ఫీచర్స్ కూడా పనిచేయకపోవచ్చు. కాబట్టి, ఈ సులభమైన పద్ధతితో అప్పుడప్పుడు మెషీన్‌ను క్లీన్ చేస్తే, దాని ఆయుష్షు పెరుగుతుంది, బట్టలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

