Seema Chintakaya:ఈ అరుదైన పండు యొక్క శక్తి తెలిస్తే.. తినకుండా ఎవరూ వదిలిపెట్టరు..!
Seema Chintakaya:ఈ అరుదైన పండు యొక్క శక్తి తెలిస్తే.. తినకుండా ఎవరూ వదిలిపెట్టరు.. సీమ చింతకాయ.. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పండు గురించి తెలిసి ఉంటుంది. గతంలో గ్రామాలు, పల్లెల్లో సీమ చింత చెట్లు సాధారణంగా కనిపించేవి. కానీ, ఇప్పుడు పట్టణీకరణ కారణంగా పల్లెలు కూడా కాంక్రీట్ అడవులుగా మారుతున్నాయి.
దీంతో, ఈ చెట్లు నేటి తరానికి పరిచయం లేకుండా పోతున్నాయి. సాధారణ చింతకాయతో పోలిస్తే, సీమ చింతకాయ రుచిలో వగరు, తీపి కలిసిన ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.
అయితే, ఈ అరుదైన పండు కేవలం రుచిలోనే కాక, ఆరోగ్య ప్రయోజనాల విషయంలో కూడా అద్భుతమైన నిధి లాంటిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ చిన్న పరిమాణంలోని సీమ చింతకాయ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు..
సీమ చింతకాయలలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో లభించే ఈ పండు కొంత తీపిగా, వగరుగా ఉంటుంది. ఇందులోని పోషకాల విషయానికి వస్తే.. విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి.
సీమ చింతకాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. వీటిని తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, గొంతు నొప్పి, చిగుళ్ల సమస్యలు, నోటి పూత వంటివి నివారిస్తుంది.
సీమ చింతకాయలను తరచూ తినడం వల్ల మధుమేహం ఉన్నవారికి కూడా మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఆకలిని తగ్గించి, ఇందులోని ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది, దీంతో బరువు తగ్గడం సులభతరమవుతుంది. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.
సీమ చింతకాయలోని గుణాలు గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో కూడా ఇవి సహాయపడతాయి. క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి.
సీమ చింతకాయలు డయేరియా సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. తరచూ వీటిని తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలను తగ్గించి, చర్మంపై నల్లని మచ్చలను తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఈ పండు విత్తనాల నుండి తీసిన నూనెను సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

