Tea:టీ తాగిన వెంటనే వీటిని తింటున్నారా.. అయితే జాగ్రత్త..
Tea:టీ తాగిన వెంటనే వీటిని తింటున్నారా.. అయితే జాగ్రత్త.. టీ తాగిన తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, బెల్లంతో తయారైన ఆహారాలు తినడం మానేయాలని సూచిస్తున్నారు. టీలోని టానిన్లు పండ్లలోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి, దీనివల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చు.
టీ తాగిన వెంటనే చల్లని పదార్థాలు తినడం లేదా చల్లని పానీయాలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుందని నిపుణులు తెలిపారు. వేడి టీ తాగిన తర్వాత చల్లని ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే, టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు, పెరుగు లేదా మజ్జిగ తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలహీనపడే అవకాశం ఉంది. టీ తాగిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు రావచ్చు. అలాగే, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా సిఫారసు చేయరు.
చాలా మంది టీ తాగుతూ వేడి వేడి బజ్జీలు, బోండాలు, పకోడీలు తినడానికి ఇష్టపడతారు, కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి నూనెలో వేయించిన ఆహారాలు తీసుకోవడం చాలా మందికి అలవాటు. అయితే, నిపుణులు దీనిని నివారించాలని సూచిస్తున్నారు. ఒక్కసారి తినడం పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ తరచూ ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల పేగుల్లో పుండ్లు ఏర్పడి, పేగు క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
టీ తాగిన తర్వాత పండ్లు తినడం వల్ల కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చని కూడా నిపుణులు తెలిపారు. కాబట్టి, రోజూ టీ తాగే వారు ఈ సూచనలను తప్పక గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

