Shoes without Socks: సాక్స్ లేకుండా బూట్లు వేసుకుంటూన్నారా.. ప్రమాదంలో పడినట్టే..
Shoes without Socks: సాక్స్ లేకుండా బూట్లు వేసుకుంటూన్నారా.. ప్రమాదంలో పడినట్టే.. ఈ రోజుల్లో చాలా మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారు, ముఖ్యంగా యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
కొందరు ఫ్యాషన్ కోసం, మరికొందరు దురద లేదా అసౌకర్యం అనిపించడం వల్ల సాక్స్ వేసుకోవడానికి ఇష్టపడరు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని, బూట్లతో పాటు పాదాలకు కూడా సమస్యలు తెస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రక్తప్రసరణ సమస్యలు:
సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి, రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది, పాదాలకు నష్టం కలిగిస్తుంది.
అలెర్జీ సమస్యలు:
సాక్స్ లేకుండా బూట్లు వేసుకోవడం వల్ల, ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారిలో, పాదాలపై అలెర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది చర్మ సమస్యలను తీవ్రతరం చేయవచ్చు.
ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం:
ఆరోగ్య నివేదికల ప్రకారం, ఒక వ్యక్తి పాదాలు రోజుకు సగటున 300 మి.లీ. చెమటను ఉత్పత్తి చేస్తాయి. సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తే, ఈ చెమట తేమగా మారి బాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
దుర్వాసన మరియు చెమట సమస్యలు:
సాక్స్ లేకుండా బూట్లు వేసుకుంటే, చెమట పేరుకుపోయి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల పాదాల నుండి దుర్వాసన వస్తుంది. మురికి సాక్స్ ధరించినా లేదా సాక్స్ లేకుండా ఉన్నా, దురద, బొబ్బలు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి:
– మంచి నాణ్యత గల బూట్లను ఎంచుకోండి.
– బూట్లు బిగుతుగా లేదా వదులుగా ఉండకూడదు.
– నాణ్యమైన, శుభ్రమైన సాక్స్ ధరించండి.
– ప్రత రోజూ సాక్స్ మార్చడం మర్చిపోవద్దు.
పాదాల ఆరోగ్యం కోసం ఈ చిన్న జాగ్రత్తలు తీటీసుకోవడం చాలా ముఖ్యం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

