Telangana Govt Jobs:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఉద్యోగాలు..
Telangana Govt Jobs:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఉద్యోగాలు..నిరుద్యోగులకు శుభవార్త! ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
వివరాలు:
– పోస్టులు: అసిస్టెంట్ వార్డెన్ పోస్టులు – 10 మహిళలు, 10 పురుషులు.
– ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
– ఇంటర్వ్యూ తేదీ & స్థలం: జూన్ 20, 2025న నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్, PJTSAU క్యాంపస్, రాజేంద్రనగర్ \, హైదరాబాద్లో.
– అర్హతలు:
– MA సోషియాలజీ లేదా MA సోషల్ వర్క్.
– బ్యాచిలర్/మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ లేదా హోటల్ మేనేజ్మెంట్.
– బీఎస్సీ ఆనర్స్ (కమ్యూనిటీ సైన్స్).
– పని చేయవలసిన ప్రాంతాలు: హైదరాబాద్, రాజేంద్రనగర్, అశ్వరావుపేట, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, పాలెం, కందది, రుద్రూర్, ఆదిలాబాద్.
– వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,000 జీతం.
– అవసరమైన డాకుమెంట్స్:
– ధృవపత్రాల జిరాక్స్ కాపీలు.
– ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డ్ కాపీలు.
– పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో అప్లికేషన్ ఫారం.
– మరిన్ని వివరాలు: అధికారిక వెబ్సైట్ https://www.pjtsau.edu.in/ ను సంప్రదించండి.
అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరయ్యే ముందు అన్ని డాకుమెంట్లను సిద్ధం చేసుకోవాలి.

