Healthhealth tips in telugu

Hydration: సైంధవ లవణం నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..త‌ప్ప‌నిసరిగా ఇంట్లో ఉండాలి..!

Hydration: సైంధవ లవణం నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వానాకాలం మొదలైనప్పటికీ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఒక రోజు వర్షం కురిస్తే, మరుసటి రోజే వేసవిని గుర్తుచేసేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం డీహైడ్రేట్ కాకుండా నీళ్లు ఎక్కువగా తాగాలి.

ఎందుకంటే, అధిక వేడిమి వల్ల చెమట ఎక్కువగా పడుతుంది, దీంతో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బయటకు పోతాయి. ఎనర్జీని తిరిగి పొందేందుకు చాలామంది జ్యూస్‌లు, డ్రింక్స్ తాగుతారు. అయితే, నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే ఎనర్జీతో పాటు ఖనిజాలు, పోషకాలు కూడా అందుతాయి.

సాధారణ ఉప్పు సరిపోతుందా?
ఇక్కడ ఉప్పు అంటే వంటలో వాడే సాధారణ ఉప్పు కాదు, సైంధవ లవణం (రాక్ సాల్ట్). ఇది హిమాలయాల్లో లభిస్తుంది. సైంధవ లవణంలో సోడియం క్లోరైడ్‌తో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు ఉంటాయి.

సైంధవ లవణం నీళ్లు ఎందుకు తాగాలి?
అధిక ఉష్ణోగ్రతల వల్ల చెమటతో పాటు సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ బయటకు పోతాయి. దీంతో అలసట, తలతిరగడం, కండరాల నొప్పులు వస్తాయి. సైంధవ లవణం కలిపిన నీళ్లు తాగితే ఈ ఎలక్ట్రోలైట్స్ తిరిగి శరీరానికి అందుతాయి.

శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది
చెమట వల్ల శరీరం చల్లబడుతుంది, కానీ సోడియం తగ్గితే చెమట తగ్గుతుంది, దీంతో హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. సైంధవ లవణం కలిపిన నీళ్లు చెమట రావడాన్ని ప్రోత్సహిస్తాయి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.

జీర్ణక్రియ మెరుగవుతుంది
సైంధవ లవణం జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కండరాల నొప్పులు తగ్గుతాయి
కండరాల నొప్పులు ఎలక్ట్రోలైట్స్ లోపం వల్ల వస్తాయి. సైంధవ లవణం కలిపిన నీళ్లలోని పొటాషియం కండరాలకు శక్తినిస్తుంది, నొప్పులను తగ్గిస్తుంది. అలాగే, సోడియం లోపం వల్ల బీపీలో హెచ్చుతగ్గులు వస్తాయి. సైంధవ లవణం సోడియంను సమతుల్యం చేసి బీపీని నియంత్రిస్తుంది. అయితే, హై బీపీ ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి తాగడం మంచిది.

వడదెబ్బ నుండి రక్షణ
సాధారణ నీళ్లు కొన్నిసార్లు శరీరంలోని ఖనిజాలను బయటకు పంపి సోడియంను తగ్గిస్తాయి. సైంధవ లవణం నీళ్లు శరీరంలో నీటిని నిల్వ చేసి, డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి. ఎండలో ఎక్కువసేపు తిరిగినవారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి ప్రాణాలకు కూడా ప్రమాదం కావచ్చు. అలాంటప్పుడు సైంధవ లవణం కలిపిన నీళ్లు తాగితే తక్షణ శక్తి లభిస్తుంది, ప్రాణాలను కాపాడవచ్చు.

టాక్సిన్స్ తొలగింపు
సైంధవ లవణం శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. దీనివల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది, పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

ఎలా వాడాలి?
ఒక లీటర్ నీళ్లలో చిటికెడు సైంధవ లవణం కలిపి తాగాలి. ఎక్కువ కలపకూడదు. కొద్దిగా నిమ్మరసం కలిపితే రుచి మరింత బాగుంటుంది.

ఎవరు తాగకూడదు?
హై బీపీ, కిడ్నీ సమస్యలు, నీరు నిల్వ ఉండే సమస్యలు, లేదా అధిక సోడియం ఆహారం తీసుకునేవారు డాక్టర్ సలహాతోనే సైంధవ లవణం నీళ్లు తాగాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ