Vankaya Allam karam Recipeవంకాయ అల్లం కారం రుచిగా ఇలా చేయండి.. రైస్ చపాతీ లో చాల బావుంటుంది..
Vankaya Allam karam Recipeవంకాయ అల్లం కారం రుచిగా ఇలా చేయండి రైస్ చపాతీ లో చాల బావుంటుంది.. వంకాయలతో చేసే టమోటా కర్రీ, వంకాయ ఫ్రై, గుత్తి వంకాయ వంటి వంటకాలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. వంకాయ కూర వండితే ఆ రోజు భోజనం తృప్తిగా ఉంటుందని చాలా మంది చెబుతారు.
అయితే, రోటీన్‌గా వంకాయ కూర చేయడం కాకుండా, ఒక్కసారి వంకాయ అల్లం కారం కూరను ట్రై చేయండి. వేడి వేడి అన్నంతో ఈ కూర రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ సులభమైన వంకాయ అల్లం కారం కూర ఎలా తయారు చేయాలో చూద్దాం!
కావలసిన పదార్థాలు
– పచ్చిమిర్చి – 12
– అల్లం ముక్క – 1
– చింతపండు – కొద్దిగా
– ఉప్పు – తగినంత
– వంకాయలు – 1 కేజీ
– ఆవాలు – 1 టీస్పూన్
– జీలకర్ర – 1 టీస్పూన్
– పచ్చి శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
– మినపప్పు – 1 టేబుల్ స్పూన్
– ఇంగువ – కొద్దిగా
– కరివేపాకు – 2 రెమ్మలు
– ఎండుమిర్చి – 4
– మినప్పిండి వడియాలు – అర కప్పు
తయారీ విధానం
1. వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి, ఉప్పు నీటిలో నానబెట్టండి. చింతపండును కడిగి, 5 నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానబెట్టి, చిక్కటి రసం తీసి పక్కన పెట్టండి.
2. స్టవ్ మీద కడాయి పెట్టి, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. వేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఇంగువ వేసి వేగించండి.
3. ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పిండి వడియాలు వేసి వేయించండి. తాలింపు బాగా వేగిన తర్వాత, నానబెట్టిన వంకాయ ముక్కలను వేసి కలపండి. ఒక గ్లాసు నీళ్లు పోసి, కడాయికి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వండి.
4. ఈ లోపు మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి, పేస్ట్‌ను పక్కన పెట్టండి. వంకాయలు అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి.
5. వంకాయలు మెత్తగా ఉడికిన తర్వాత, స్టవ్‌ను సిమ్‌లో ఉంచి, చింతపండు రసం, తగినంత ఉప్పు, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలపండి. మూత పెట్టి మరో 5 నిమిషాలు సిమ్‌లో మగ్గనివ్వండి.
6. వంకాయలు పూర్తిగా ఉడికిన తర్వాత, అవసరమైతే కొద్దిగా నూనె, ఉప్పు కలిపి సర్దుబాటు చేయండి. అంతే, రుచికరమైన వంకాయ అల్లం కారం కూర సిద్ధం!
వేడి వేడి అన్నంతో ఈ కూర రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ తయారీ విధానం నచ్చితే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి!

