Kitchenvantalu

Ragi Poori Recipe: షుగర్ ఉన్న వారి కోసం “రాగి పూరి” రెసిపీ, ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు

Ragi Poori Recipe: షుగర్ ఉన్న వారి కోసం రాగి పూరి రెసిపీ, ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు.. ఈ సారి పూరీలు చేసేటప్పుడు రాగి పిండితో ఒకసారి ఇలా ప్రయత్నించండి. ఈ విధానంలో చేస్తే ప్రతి పూరీ సంపూర్ణంగా పొంగుతుంది మరియు నూనె కూడా ఎక్కువగా పీల్చదు. ఈ రాగి పూరీలు నాన్-వెజ్ కూరలతో కూడా రుచికరంగా ఉంటాయి. అయితే ఇక ఆలస్యం చేయకుండా హెల్దీ రాగి పూరీల తయారీ విధానాన్ని ఈ కథనంలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
– గోధుమ పిండి – 1 కప్పు
– రాగి పిండి – 1 కప్పు
– ఉప్పు – రుచికి సరిపడా
– నూనె – డీప్ ఫ్రైకి అవసరమైనంత
– బొంబాయి రవ్వ – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసి బాగా కలపండి.
2. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని మరీ మెత్తగా కానీ, మరీ గట్టిగా కానీ కాకుండా మధ్యస్థంగా మెత్తగా కలుపుకోండి.
3. ఈ విధంగా పిండిని తయారు చేయడం వల్ల పూరీలు నూనె ఎక్కువగా పీల్చవు. పిండిని కలిపిన తర్వాత కొద్దిగా నూనె వేసి మరో 5 నిమిషాలు బాగా మెదడండి.
4. ఇప్పుడు పిండిపై మూత పెట్టి సుమారు 15 నిమిషాలు పక్కన ఉంచండి.
5. పిండి నానిన తర్వాత మరోసారి కలిపి, పూరీలకు సరిపడా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోండి.
6. ఇప్పుడు స్టవ్ వెలిగించి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగనివ్వండి.
7. నూనె వేడెక్కే సమయంలో రాగి ఉండను తీసుకుని, పొడి పిండి చల్లి, కర్రతో పూరీలుగా రుద్దుకోండి.
8. నూనె బాగా వేడయ్యాక, రుద్దిన పూరీలను వేసి రెండు వైపులా ఎర్రగా వేయించండి.
9. ఇలా అన్ని ఉండలను పూరీలుగా చేసి వేయించండి. అంతే, రుచికరమైన రాగి పూరీలు సిద్ధం!

వేడివేడిగా ఈ రాగి పూరీలను బొంబాయి చట్నీతో లేదా ఏ కూరతో తిన్నా అద్భుతంగా ఉంటాయి. ఈ హెల్దీ రాగి పూరీల తయారీ విధానం మీకు నచ్చితే, మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.

టిప్స్:
– పూరీలు బాగా పొంగాలంటే, నూనె బాగా వేడిగా ఉండాలి.
– రాగి పూరీలను వేసిన తర్వాత, వాటిపై గరిటెతో నూనె పోస్తూ వేయించడం వల్ల అవి బాగా పొంగుతాయి.