Health Tips:తుమ్ము ఆపుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి..
Health Tips:తుమ్ము ఆపుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి.. తుమ్మడం అనేది సర్వసాధారణమైన ప్రక్రియ. ప్రతి ఒక్కరూ తుమ్ముతుంటారు. కొందరికి సహజంగా తుమ్ములు వస్తే, మరికొందరికి దుమ్ము, జలుబు వంటి సమస్యల వల్ల తుమ్ములు వస్తాయి. అయితే, కొన్నిసార్లు కొంతమంది తుమ్మును ఆపుకుంటారు. ఇలా తుమ్ము ఆపుకోవడం ఆరోగ్యానికి మంచిదా, కాదా? ఈ విషయాన్ని తెలుసుకుందాం.
తుమ్మడం సహజమైన శరీర ప్రక్రియ అయినప్పటికీ, కొంతమంది కొన్ని సందర్భాల్లో లేదా ఉద్దేశపూర్వకంగా తుమ్మును ఆపుకుంటారు. అయితే, ఆరోగ్య నిపుణులు ఇది శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. తుమ్ము ఆపుకోవడం వల్ల శరీరంలోని పలు అవయవాలకు తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు. అవి ఏమిటంటే?
తుమ్ము ఆపుకుంటే, శరీరంలో గాలి పీడనం అధికంగా పెరుగుతుంది. ఈ పీడనం కళ్లపై ప్రభావం చూపుతుంది. శరీరంలో పెరిగిన గాలి పీడనం కంటిలోని రక్తనాళాలపై ఒత్తిడి తెచ్చి, చూపు మందగించే ప్రమాదాన్ని కలిగిస్తుంది.
అదేవిధంగా, తుమ్ము ఆపుకోవడం వల్ల వేగంగా వచ్చే గాలి శరీరంలో ఆగిపోయి, చెవులలోకి చొచ్చుకుపోతుంది. ఈ వేగవంతమైన గాలి పీడనం వల్ల చెవిలోని కర్ణభేరి దెబ్బతిని, వినికిడి లోపం రావచ్చు.
ఇవి మాత్రమే కాదు, తుమ్ము ఆపుకోవడం వల్ల వెన్నుపాము దెబ్బతినడం, మెడ నరాలు బిగుసుకుపోవడం, తలనొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతేకాక, తుమ్మును బలంగా ఆపినప్పుడు నరాలపై కూడా ప్రభావం పడుతుంది, ఇది పక్షవాతం వచ్చే అవకాశాన్ని కూడా పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుకే, తుమ్మడం సహజమైన ప్రక్రియ కాబట్టి, దానిని సహజంగా వదిలేయడం మంచిది. ఒకవేళ మీరు గుండెల్లో ఉన్నప్పుడు లేదా తుమ్మడం ఇబ్బందికరంగా అనిపిస్తే, టిష్యూ పేపర్‌ను ముక్కు వద్ద అడ్డంగా పెట్టుకొని తుమ్మండి. ఎట్టిపరిస్థితుల్లోనూ తుమ్మును ఆపుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

