Kitchen Hacks: వర్షాకాలంలో పప్పులకు పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరి..
Kitchen Hacks: వర్షాకాలంలో పప్పులకు పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరి.. వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సీజన్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా మందికి ఇది ఇష్టమైన కాలం. అయితే, ఈ సీజన్లో సమస్యలూ తక్కువేమీ కాదు.
వర్షాకాలంలో చాలా మంది వ్యాధుల బారిన పడతారు. అంతేకాకుండా, వంటగదిలో బియ్యం, పప్పు దినుసులు కూడా దెబ్బతింటాయి. ఎంత జాగ్రత్తగా నిల్వ చేసినా, తేమ కారణంగా బియ్యం, పప్పులకు పురుగులు, కీటకాలు, బ్యాక్టీరియా వచ్చి చేరతాయి. ఈ సమస్యలను నివారించడానికి, లేదా వచ్చిన తర్వాత వాటిని తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
1. ఎండలో ఆరబెట్టడం
బియ్యం, పప్పులను ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని తేమ పూర్తిగా తొలగిపోతుంది. వర్షాకాలం రాకముందే, ఎండలు బాగా ఉన్నప్పుడు బియ్యం, పప్పులను ఆరబెట్టి నిల్వ చేస్తే, తేమ పోవడంతో పాటు ఎక్కువ రోజులు పాడవకుండా, పురుగులు రాకుండా సురక్షితంగా ఉంటాయి.
2. వేప ఆకుల వాడకం
వేప ఆకులు బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధిని అడ్డుకుంటాయి. ఎండిన వేప ఆకులను బియ్యం, పప్పులు నిల్వ చేసే సంచుల్లో లేదా డబ్బాల్లో వేయాలి. ఇలా చేయడం వల్ల పురుగులు రాకుండా నివారించడమే కాకుండా, ఇప్పటికే ఉన్నవి కూడా తొలగిపోతాయి. నెలకొకసారి ఈ ఆకులను మార్చడం మర్చిపోవద్దు.
3. లవంగాలతో నివారణ
బియ్యం, పప్పులు నిల్వ చేసే కంటైనర్‌లో 4-5 లవంగాలు వేయడం వల్ల పురుగులు, కీటకాలు దరిచేరవు. లవంగాల ఘాటైన వాసన తేమను తొలగించి, పురుగులను తరిమికొడుతుంది. ఇది దినుసులను ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది.
4. రాక్ సాల్ట్ వాడకం
బియ్యం, పప్పుల డబ్బాల్లో రాక్ సాల్ట్ (ఉప్పు) మూట కట్టి ఉంచితే తేమను గ్రహించి, పురుగులు రాకుండా చేస్తుంది. డైరెక్ట్‌గా ఉప్పు కలపకుండా, ఒక గుడ్డలో కట్టి డబ్బాలో ఉంచితే సరిపోతుంది. ఇలా చేస్తే దినుసులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
5. సిలికా జెల్ ప్యాకెట్లు
మార్కెట్లో సులభంగా దొరికే సిలికా జెల్ ప్యాకెట్లు తేమను గ్రహిస్తాయి. బియ్యం, పప్పులు నిల్వ చేసే కంటైనర్‌లో ఈ ప్యాకెట్లను ఉంచితే, వర్షాకాలంలో దినుసులు చెడిపోకుండా కాపాడతాయి.
6. నల్ల మిరియాలు లేదా బిర్యానీ ఆకు
కంటైనర్‌లో 5-6 నల్ల మిరియాలు లేదా 2-3 బిర్యానీ ఆకులు వేయడం వల్ల బియ్యం, పప్పులు చెడిపోకుండా ఉంటాయి. ఇవి పురుగులను దూరంగా ఉంచి, దినుసులను సురక్షితంగా నిల్వ చేయడానికి సహాయపడతాయి.
7. ఇంగువ వాడకం
పప్పులు నిల్వ చేసే డబ్బాల్లో చిన్న ఇంగువ ముక్క ఉంచితే కీటకాలు, తేమ నుండి రక్షణ లభిస్తుంది. ఇది దినుసులను సురక్షితంగా ఉంచుతుంది.
పురుగులు వచ్చిన తర్వాత ఏం చేయాలి?
ఒకవేళ బియ్యం, పప్పుల్లో పురుగులు లేదా కీటకాలు వచ్చినట్లయితే, వెంటనే వాటిని ఎండలో ఆరబెట్టండి లేదా పాన్‌లో వేయించండి. తర్వాత జల్లెడతో వడగట్టి, వేప ఆకులు, లవంగాలు వేసి మళ్లీ నిల్వ చేయండి. ఈ విధంగా చేస్తే దినుసులు సురక్షితంగా, తాజాగా ఉంటాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

