Ginger And Honey:పరగడుపునే అల్లం, తేనె కలిపి తింటే అదిరిపోయే లాభాలు.. ఈ సమస్యలు ఉన్న వారికీ..
Ginger And Honey:పరగడుపునే అల్లం, తేనె కలిపి తింటే అదిరిపోయే లాభాలు.. ఈ సమస్యలు ఉన్న వారికీ.. అల్లం, తేనెల ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలిసినవే. గ్రామాల్లో ఇప్పటికీ చాలా మంది పెద్దలు ఉదయం తేనెతో అల్లం ముక్కలు తినే సాంప్రదాయాన్ని అనుసరిస్తారు.
ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే పోషక విలువలు రెట్టింపు అవుతాయని, సన్నగా తరిగిన అల్లం ముక్కలను తేనెతో తీసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే అల్లం, తేనె కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం.
తేనెలో క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్ సి, బి విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. అల్లం నోటి దుర్వాసనను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అల్లం, తేనె కలిపి తీసుకోవడం వల్ల గొంతులోని శ్లేష్మం తొలగిపోతుంది. అల్లంలోని రోగనిరోధక గుణాలతో కలిసి ఈ మిశ్రమం దగ్గు, జలుబును తగ్గించే సహజ ఔషధంగా పనిచేస్తుంది.
అల్లంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, బి3, బి6 విటమిన్లు, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇందులోని జింజరాల్ యాంటీ-ఇన్‌ఫ్లామేటరీ గుణాలతో ఒత్తిడిని తగ్గించి, మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.
అల్లం, తేనె కలిసి సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. ఈ మిశ్రమం ఆకలిని పెంచుతూ, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు గట్ హెల్త్‌కు తోడ్పడుతుంది. అల్లంలోని సహజ జీర్ణ గుణాలు ఇందుకు దోహదం చేస్తాయి.
ఈ మిశ్రమం కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వికారం, వాంతుల వంటి సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు వేడినీటిలో అల్లం, తేనె కలిపి తీసుకుంటే మార్నింగ్ సిక్‌నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు.
అల్లం, తేనె మిశ్రమంలో యాంటీఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ కలయిక ఎన్నో ఆరోగ్య సమస్యలకు సహజ ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పురుషుల ఆరోగ్యానికి కూడా ఈ మిశ్రమం ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని వారు సూచిస్తున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

