Bilva Leaves:రోజూ ఉదయం పరగడుపునే 2 లేదా 3 ఆకులను నమిలి తింటే..
Bilva Leaves:రోజూ ఉదయం పరగడుపునే 2 లేదా 3 ఆకులను నమిలి తింటే.. బిల్వ పత్రాలు పరమేశ్వరుడి పూజలో ఉపయోగించడం సాధారణం. ఈ పత్రాలను సమర్పిస్తే శివుడు అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అయితే, బిల్వ పత్రాలు ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
ఆయుర్వేదంలో బిల్వ పత్రాలను అద్భుతమైన ఔషధంగా పేర్కొంటారు. ఇవి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. బిల్వ వృక్షానికి చెందిన ఆకులు, పండ్లు, వేర్లు, బెరడు కూడా ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆకులను ఔషధంగా విరివిగా ఉపయోగిస్తారు.
జీర్ణ సమస్యలకు పరిష్కారం
బిల్వ పత్రాలు జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక ఔషధాల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో ఆస్ట్రింజెంట్ గుణాలు ఉండటం వల్ల విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే, జీర్ణ వ్యవస్థను రక్షిస్తాయి.
మలబద్ధకానికి ఔషధం
బిల్వ ఆకులు మలబద్ధకాన్ని తగ్గించడంలో ఔషధంగా పనిచేస్తాయి. బిల్వ ఆకులతో మిరియాలు కలిపి మరిగించిన కషాయాన్ని తాగితే మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేసి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బిల్వ ఆకులు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
డయాబెటిస్ నియంత్రణకు
బిల్వ ఆకుల్లో యాంటీ-డయాబెటిక్ గుణాలు ఉంటాయి, ఇవి షుగర్ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆకులు శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తాయి, దీంతో రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి. అయితే, డయాబెటిస్ ఉన్నవారు బిల్వ ఆకులను ఉపయోగించేటప్పుడు షుగర్ స్థాయిలు ఒక్కసారిగా ఎక్కువగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వైద్యుడి సలహా మేరకు షుగర్ మందుల వాడకాన్ని సర్దుబాటు చేయాలి.
రోగ నిరోధక శక్తికి
బిల్వ పత్రాల్లో టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, శరీరంలో వాపులను నివారిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ ఆకుల్లోని విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే, యాంటీ-మైక్రోబియల్, యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్ గుణాలు ఈ ఆకుల్లో ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
లివర్ ఆరోగ్యానికి
బిల్వ పత్రాల్లో హెపాటోప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి, ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. లివర్ వాపు లేదా డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి. లివర్‌లోని కొవ్వు కరిగి, వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి. మద్యం అధికంగా సేవించినవారు మద్యం మానేసి బిల్వ పత్రాలను తీసుకుంటే లివర్ పునరుద్ధరణ జరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య కూడా తగ్గుతుంది.
రక్త శుద్ధికి
బిల్వ పత్రాలు రక్త శుద్ధిని ప్రోత్సహిస్తాయి. రక్తంలోని మలినాలు, కొవ్వు, వ్యర్థాలు తొలగిపోతాయి. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఉపయోగించే విధానం
బిల్వ ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. రోజూ ఉదయం పరగడుపున 2 లేదా 3 ఆకులను నమిలి తినాలి. లేదా కషాయంగా తయారు చేసి తాగవచ్చు. ఈ విధంగా బిల్వ ఆకులను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

