Devotional

Ashada masam 2025:2025 ఆషాడమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు.. ప్రత్యేకతలు..

Ashada masam 2025:2025 ఆషాడమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు.. ప్రత్యేకతలు.. ఆషాఢ మాసం (జూన్ 26 నుంచి జూలై 24 వరకు) హిందూ మతంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన మాసం.

ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును, శివుడిని పూజిస్తే ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం. హిందూ క్యాలెండర్‌లో చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాసాల తర్వాత వచ్చే నాల్గవ మాసం ఆషాఢం. రుతుపవనాల ప్రారంభాన్ని సూచించే ఈ మాసం మతపరంగా కూడా చాలా విశిష్టమైనది. ఈ మాసంలో జరిగే పండుగలు, వ్రతాలు ఇలా ఉన్నాయి:

1. జూన్ 26 – బోనాలు (ఆషాఢ శుద్ధ పాడ్యమి):
తెలంగాణలో ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారంతో బోనాల సందడి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జూన్ 26 గురువారంతో ఆషాఢం మొదలవడంతో బోనాలు కూడా అదే రోజు ప్రారంభమవుతాయి. అంటువ్యాధుల నుంచి రక్షణ, ఆరోగ్యం కోసం అమ్మవారికి బోనం సమర్పిస్తారు.

2. జూన్ 26 – వారాహీ నవరాత్రులు (ఆషాఢ శుద్ధ పాడ్యమి):
ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు వారాహీ నవరాత్రులు జరుగుతాయి. ఈ సమయంలో భక్తులు శరన్నవరాత్రుల్లాగే దీక్షతో అమ్మవారిని పూజిస్తారు. ఉపవాసాలు, పూజలు చేస్తారు. వారాహీ అమ్మవారి పూజ వల్ల అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుందని నమ్మకం.

3. జూన్ 27 – పూరీ జగన్నాథ రథయాత్ర (ఆషాఢ శుద్ధ విదియ):
ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరీలో జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరుగుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ రోజు గర్భగుడి నుంచి బయటకు వచ్చి భక్తుల మధ్య పది రోజుల పాటు ఉత్సవాల్లో పాల్గొంటారు.

4. జూలై 6 – తొలి ఏకాదశి:
ఆషాఢంలో వచ్చే ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతారని పురాణాలు చెబుతున్నాయి. ఇది దేవతలకు రాత్రి కాలం (దక్షిణాయనం) ప్రారంభమైనట్లు సూచిస్తుంది.

5. జూలై 10 – గురు పూర్ణిమ (వ్యాస పౌర్ణమి):
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలను అందించిన వేదవ్యాసుడిని ఆదిగురువుగా పూజిస్తారు. ఆయన జన్మతిథి అయిన ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజు గురువులను స్మరించి, ఆశీస్సులు పొందుతారు.

6. జూలై 13 – సికింద్రాబాద్ మహంకాళి జాతర:
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో జూలై 13న బోనాల సమర్పణ, జూలై 14న రంగం (భవిష్యవాణి) మరియు అమ్మవారి అంబారి ఊరేగింపు జరుగుతాయి. ఈ రెండు రోజులూ లక్షలాది భక్తులు తరలివస్తారు.

7. జూలై 17 – కర్కాటక సంక్రాంతి:
సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించే రోజుని కర్కాటక సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది.

8. జూలై 20 – లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు:
హైదరాబాద్‌లోని లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. వర్షాకాలంలో అంటువ్యాధుల నుంచి రక్షణ కోసం ఈ ఆచారం జరుగుతుంది.

9. జూలై 24 – చుక్కల అమావాస్య:
ఆషాఢ మాసం ఈ రోజుతో ముగుస్తుంది. ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. వివాహిత మహిళలు దీపస్తంభ వ్రతం ఆచరించి, శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. సంతానం, సౌభాగ్యం కోసం ఈ వ్రతం నోచుకుంటారు.

ఆషాఢ మాసంలో పూజలు, దానధర్మాలు:
– ప్రతి రోజు తెల్లవారుజామున స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం సమర్పించి, పూజలు చేస్తే రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
– శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఎర్రటి పూలు, తామర పూలు సమర్పిస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది.
– దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం, మంచి ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

ఆషాఢ మాసం విశిష్టతను గుర్తించి, భక్తిశ్రద్ధలతో పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."