Kitchen Cleaning Tips: కిచెన్‌లో నూనె జిడ్డు మరకలు వదలట్లేదా? – ఇలా సింపుల్‌గా క్లీన్ చేసేయండి
Kitchen Cleaning Tips: కిచెన్‌లో నూనె జిడ్డు మరకలు వదలట్లేదా? – ఇలా సింపుల్‌గా క్లీన్ చేసేయండి .. చాలా మంది వంటగదిలో నూనె జిడ్డు తొలగించడానికి చాలా కష్టపడతారు. ముఖ్యంగా వంట చేసేటప్పుడు గ్యాస్ వెనుక భాగంలో నూనె చిమ్మడం వల్ల టైల్స్ జిడ్డుగా మారుతాయి.
దీన్ని శుభ్రం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించకపోవచ్చు. అయితే, వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సులభమైన చిట్కాలతో వంటగదిలోని జిడ్డు మరకలను సులభంగా తొలగించవచ్చు.
నిమ్మరసం: వంటగది ప్లాట్‌ఫామ్, టైల్స్‌పై ఉన్న నూనె మరకలను తొలగించడంలో నిమ్మరసం చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ తీసుకుని, అందులో సగం నిమ్మకాయ రసం పిండి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో స్క్రబ్బర్‌ను ముంచి, జిడ్డు ఉన్న ప్లాట్‌ఫామ్ లేదా టైల్స్‌ను శుభ్రం చేయాలి.
ఆ తర్వాత, నీటిలో తడిపిన కాటన్ గుడ్డతో మళ్లీ శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జిడ్డు మరకలు సులభంగా తొలగిపోయి, వంటగది నీట్‌గా కనిపిస్తుంది. ఈ డిష్ వాష్, నిమ్మరసం మిశ్రమం సింక్ మరియు టైల్స్‌ను కూడా శుభ్రపరచడంలో బాగా ఉపయోగపడుతుంది.
వెనిగర్: వెనిగర్ వంటల రుచిని పెంచడమే కాకుండా, శుభ్రపరిచే ఏజెంట్‌గా కూడా బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. వంటగది ప్లాట్‌ఫామ్, ఫ్లోర్‌పై ఉన్న మరకలను తొలగించడానికి ఇది చాలా ఉపయోగకరం.
ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో ఒకటి లేదా రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా, రెండు చెంచాల వెనిగర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో నింపి, జిడ్డు ఉన్న ప్రాంతాలపై స్ప్రే చేసి శుభ్రం చేయాలి. ఈ విధానంతో ఎంతటి మొండి మరకలైనా సులభంగా తొలగిపోతాయి.
బేకింగ్ సోడా: వంటగది స్లాబ్‌పై ఉన్న నూనె మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా గోరువెచ్చని నీరు, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, సగం నిమ్మకాయ రసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో నింపి, జిడ్డు మరకలపై స్ప్రే చేసి, బ్రష్‌తో రుద్ది శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి మొండి మరకలైనా తేలిగ్గా తొలగిపోతాయి.
అలాగే, వంటగది ప్లాట్‌ఫామ్‌పై నూనె మరకలు పడిన వెంటనే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవి జిడ్డుగా మారకుండా ఉంటాయి. ఒకవేళ వదిలేస్తే, కొన్ని రోజులకు అవి మొండి మరకలుగా మారతాయి. కాబట్టి, వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

