Healthhealth tips in telugu

Back Pain Remedies:కుర్చీలో ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల నడుము నొప్పిగా ఉంటోందా.. వీటిని ఫాలో అయితే సరి..

Back Pain Remedies:కుర్చీలో ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల నడుము నొప్పిగా ఉంటోందా.. వీటిని ఫాలో అయితే సరి.. హైటెక్ యుగంలో దాదాపు అందరూ కుర్చీలో కూర్చొని కంప్యూటర్‌పై పనిచేస్తున్నారు.

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్ను, నడుముపై ఒత్తిడి పడి నొప్పి తలెత్తుతుంది. ఆఫీసుకు వెళ్లి పనిచేయక తప్పదు కాబట్టి, నొప్పి ఉన్నా భరించి పని కొనసాగిస్తారు. అయితే, ఇంట్లో లభ్యమయ్యే కొన్ని పదార్థాలతో నడుం, వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ పదార్థాలు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నలుగురిలో ఇద్దరు నడుం లేదా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పికి వయసుతో సంబంధం లేదు. నొప్పి స్వల్పంగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలతో నివారించుకోవచ్చు. చిన్న విషయాలకు మందులపై ఆధారపడకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంటి చిట్కాలతో నొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే, నొప్పి తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.

వెల్లుల్లి: వెల్లుల్లిలోని అల్లిసిన్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సహజ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 2-3 వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల నొప్పి తగ్గుతుంది. పచ్చిగా తినలేనివారు వంటలో వేసుకొని తినవచ్చు.

అల్లం: వంటింట్లో లభించే అద్భుతమైన ఔషధం అల్లం. ఇది వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ వంటలో అల్లం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలా కుదరనప్పుడు రోజూ ఒకసారి అల్లం టీ తాగితే సరిపోతుంది.

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, అనాల్జెసిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. నొప్పి ఉన్న చోట పావు టీస్పూన్ కొబ్బరి నూనె రాసి 10 నిమిషాలు మసాజ్ చేయాలి. రోజుకు 2-3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు కలిపిన పాలు: పసుపులోని కర్క్యూమిన్ ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. పాలలోని కాల్షియం, విటమిన్-డి ఎముకలను బలోపేతం చేస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు పసుపు కలిపిన పాలు తాగడం అలవాటు చేసుకుంటే నొప్పి తగ్గుతుంది.

ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌లోని ఓలియోకాంతల్ నొప్పిని తగ్గించే సహజ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. నొప్పి ఉన్న చోట పావు టీస్పూన్ ఆలివ్ ఆయిల్ రాసి 10 నిమిషాలు మసాజ్ చేయాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే నొప్పి క్రమంగా తగ్గుతుంది.

యోగా: యోగా శరీరానికి బలాన్ని అందించి, ఫిట్‌గా ఉంచుతుంది. వెన్ను నొప్పికి ప్రత్యేక యోగాసనాలు ఉన్నాయి. వీటిని రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

డాక్టర్ సంప్రదింపు: నొప్పి తీవ్రంగా ఉంటే, శరీరం కుంగిపోతుంటే, చేతులు, కాళ్లలో తిమ్మిరి లేదా మొద్దుబారడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇంటి చిట్కాలతో నొప్పి తగ్గనప్పుడు కూడా హాస్పిటల్‌కు వెళ్లడం మంచిది.

హాట్ & కోల్డ్ కంప్రెస్: వెన్ను బెణికినప్పుడు ఐస్ ప్యాక్ వాడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. కోల్డ్ కంప్రెస్ నొప్పిని తగ్గిస్తుంది. అలాగే, హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీటి బ్యాగ్‌తో హాట్ కంప్రెస్ గట్టిపడిన కండరాలను సడలిస్తుంది. ఐస్ లేదా హాట్ ప్యాక్‌ను 20 నిమిషాల కంటే ఎక్కువసేపు వాడకూడదు. నొప్పి తీవ్రతను బట్టి రోజులో ఎన్నిసార్లు అయినా ఈ కంప్రెస్‌లను అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ