Kitchenvantalu

Atukula Upma:చిటికెలో అయిపోయే “అటుకుల ఉప్మా” పోడి పోడి గా soft గా రావాలంటే అమ్మ చెప్పిన చిట్కా

Atukula Upma:మహారాష్ట్రలో ఉదయం అల్పాహారంగా చాలామంది కంద పోహా తింటారు. మన దగ్గర దీనిని అటుకుల ఉప్మా అని పిలుస్తారు. ఈ వంటకం అల్పాహారంగా, రాత్రి భోజనంగా లేదా స్నాక్‌గా ఎప్పుడైనా తినవచ్చు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఈ వంటకం ఇష్టం.

ఒకసారి రుచి చూస్తే, మళ్లీ మళ్లీ చేయమని ఇంట్లో వాళ్లను వేధించడం ఖాయం. ఇంట్లో మహారాష్ట్ర స్పెషల్ కంద పోహాను ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అటుకుల ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు:
– అటుకులు
– బంగాళదుంప
– పల్లీలు
– నూనె
– నిమ్మరసం
– పచ్చిమిర్చి తరుగు
– ఉల్లిపాయ తరుగు
– కరివేపాకు
– కొత్తిమీర తరుగు
– ఆవాలు
– జీలకర్ర
– ఇంగువ
– పసుపు
– ఉప్పు
– చక్కెర

అటుకుల ఉప్మా తయారీ విధానం:
1. ముందుగా 2 కప్పుల అటుకులను జల్లెడలో వేసి శుభ్రంగా జల్లించుకోవాలి.

2. అటుకులలో 300 మి.లీ. నీటిని పోసి, అన్ని అటుకులు తడిచేలా బాగా కలిపి, పావుగంట పక్కన పెట్టాలి. నీరు ఎక్కువైతే అటుకులు ముద్దగా అయిపోతాయి, కాబట్టి జాగ్రత్త.

3. స్టవ్ మీద పాన్ పెట్టి, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.

4. నూనె వేడయ్యాక, పావు కప్పు పల్లీలను వేసి తక్కువ మంట మీద ఎర్రగా వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

5. అదే నూనెలో 1 టీస్పూన్ ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేగాక, 1 టీస్పూన్ జీలకర్ర, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రెండు చిటికెడు ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించాలి.

6. తర్వాత, సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలను వేసి 2 నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయలు ఎక్కువగా మెత్తబడకూడదు.

7. ఆ తర్వాత, చిన్న ముక్కలుగా తరిగిన 1 బంగాళదుంప, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, ముప్పావు టీస్పూన్ చక్కెర వేసి, బంగాళదుంప ముక్కల్లో పచ్చివాసన పోయే వరకు వేయించాలి.

8. ఆ తర్వాత, 3 టేబుల్ స్పూన్ల నీటిని పోసి బాగా కలిపి, మూత పెట్టి మీడియం మంట మీద 7-8 నిమిషాలు మగ్గనివ్వాలి.

9. ఆ తర్వాత, తడిపి పెట్టుకున్న అటుకులను వేసి, అన్నీ సమానంగా కలిసేలా కలపాలి.

10. పాన్ అంచుల చుట్టూ 3 టేబుల్ స్పూన్ల నీటిని పోసి, కదపకుండా మూత పెట్టి మీడియం మంట మీద 5-6 నిమిషాలు ఉంచాలి.

11. చివరగా, స్టవ్ ఆపేసి, వేయించిన పల్లీలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి బాగా కలపాలి. అంతే, రుచికరమైన కంద పోహా సిద్ధం!