Kitchenvantalu

Panasakaya Biryani: కోనసీమ స్పెషల్ “పనసకాయ బిర్యానీ”ని ఇలా తయారు చేసుకోండి.. టేస్ట్ అదుర్స్

Panasakaya Biryani:ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీలకు బదులుగా పనసకాయ బిర్యానీ ఎక్కువగా వడ్డిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఏదైనా వేడుకలో పనసకాయ బిర్యానీ తప్పనిసరిగా ఉంటోంది.

ఈ బిర్యానీ నాన్-వెజ్ రుచికి ఏమాత్రం తీసిపోకుండా, అద్భుతమైన రుచితో ఒక్కసారి తింటే మళ్లీ తినాలనే కోరిక కలుగుతుంది. ఇంట్లోనే పనసకాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ వివరంగా ఉంది.

పనసకాయ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:**
– పచ్చి పనసకాయ ముక్కలు
– అల్లం
– వెల్లుల్లి
– మిరియాలు
– ధనియాలు
– సోంపు
– బిర్యానీ ఆకు
– అనాస పువ్వు
– జాపత్రి
– జీలకర్ర
– యాలకలు
– లవంగాలు
– దాల్చిన చెక్క
– రాతి పుష్పం (పత్తర్ పూల్)
– నూనె
– బాస్మతి బియ్యం
– టమాట
– పచ్చిమిర్చి
– ఉల్లిపాయ
– స్టార్ అనాస
– పుదీనా
– కొత్తిమీర
– పెరుగు
– పాలు
– నిమ్మరసం
– నెయ్యి

పనసకాయ బిర్యానీ తయారీ విధానం:**
1. ముందుగా పచ్చి పనసకాయ ముక్కలను మజ్జిగలో రాత్రంతా నానబెట్టాలి.
2. స్టవ్ మీద ఒక గిన్నె లేదా మూకుడు పెట్టి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వులు, 1 జాపత్రి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7 యాలకలు, 8 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి సన్నని సెగ మీద వేయించాలి.
3. మసాలాలు సగం వేగిన తర్వాత కొద్దిగా రాతి పుష్పం (పత్తర్ పూల్) వేసి వేయించాలి.
4. వీటిని మిక్సీ గిన్నెలో వేసి, కొంచెం అల్లం, 7 వెల్లుల్లి రెబ్బలు కలిపి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేయాలి.
5. ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, నానబెట్టిన పనసకాయ ముక్కలను వేసి, అవి మెత్తబడి లేత గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు (సుమారు 5 నిమిషాలు) వేయించి పక్కన పెట్టుకోవాలి.
6. అడుగు మందంగా ఉన్న గిన్నెలో 5 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేసి, 1 టీస్పూన్ జీలకర్ర, 4 లవంగ మెగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 దంచిన యాలకలు, 2 స్టార్ అనాస వేసి వేయించాలి. తర్వాత 200 గ్రాముల సన్నగా చీరిన ఉల్లిపాయలు, 4 పొడవుగా చీరిన పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మూతపెట్టి వేయించాలి.
7. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత, రాత్రంతా నానబెట్టిన అర కప్పు డబుల్ బీన్స్ వేసి మగ్గనివ్వాలి.
8. అందులో 1 టమాట తరుగు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు, 1½ టీస్పూన్ కారం, ½ టీస్పూన్ పసుపు, 50ml నీరు పోసి బాగా కలపాలి.
9. తర్వాత గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి, నీరు పైకి తేలే వరకు ఉడికించాలి.
10. నీరు తేలిన తర్వాత, నానబెట్టిన పనసకాయ ముక్కలను వేసి కలిపి, అర కప్పు చిలికిన పెరుగు, అర కప్పు పాలు, 1 నిమ్మకాయ రసం పోసి నెమ్మదిగా కలపాలి. మూతపెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
11. గంటసేపు నానబెట్టిన 2½ కప్పుల (1 కప్పు = 150 గ్రాములు) బాస్మతి బియ్యం, 5 కప్పుల వేడి నీరు పోసి, మూతపెట్టి పెద్ద మంటమీద 5 నిమిషాలు ఉడికించాలి.
12. ఉడికిన రెండు నిమిషాల ముందు ¼ కప్పు నెయ్యి వేసి కలపాలి. అంతే, పనసకాయ బిర్యానీ సిద్ధం!