Kitchenvantalu

Tamalapaku Rice:లంచ్ బాక్సులకి ఘుమఘుమలాడే “తమలపాకుల అన్నం”..ఘాటుగా,కారంగా..

Tamalapaku Rice:లంచ్ బాక్సులకి ఘుమఘుమలాడే “తమలపాకుల అన్నం”..ఘాటుగా,కారంగా.. మిగిలిన అన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్, పులిహోర, టమాటో రైస్ వంటివి చేసుకునే బదులు, ఒకసారి తమలపాకు రైస్ రెసిపీని ప్రయత్నించండి. ఇది కారంగా, ఘాటుగా, గుండెల్ని ఆకర్షించే సుగంధంతో అద్భుతమైన రుచిన “

తమలపాకు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

– పల్లీలు
– ఎండుమిర్చి
– తమలపాకులు
– ఉల్లిపాయలు
– నూనె
– ఉప్పు
– పసుపు
– జీలకర్ర
– ఆవాలు
– నువ్వులు
– మినపప్పు
– వెల్లుల్లి

తమలపాకు రైస్ తయారీ విధానం

1. ముందుగా స్టవ్ మీద ఒక పాన్‌లో 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి, మినపప్పు సుగంధభరితంగా రంగు మారే వరకు వేయించండి. అప్పుడు 5 ఎండుమిరపకాయలు వేసి వేయించండి.

2. ఇప్పుడు 2½ టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి, చిటపటలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి.

3. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేయండి.

4. అదే పాన్‌లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అందులో ¼ కప్పు పల్లీలు వేసి ఎర్రగా వేగిన తర్వాత, ¾ టీస్పూన్ జీలకర్ర, ¾ టీస్పూన్ ఆవాలు, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి వేయించండి.

5. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత, 5 తమలపాకులను సన్నగా తరిగి వేసి 3 నిమిషాలు వేయించండి. ఎక్కువగా వేయిస్తే తమలపాకుల ఘాటు, సుగంధం పోతాయని గుర్తుంచుకోండి.

6. తర్వాత వండిన అన్నం లేదా మిగిలిన అన్నం, గ్రైండ్ చేసిన పొడి వేసి, పెద్ద మంట మీద 2-3 నిమిషాలు కలుపుతూ వేయించండి. స్టవ్ ఆఫ్ చేసి, తమలపాకు రైస్ సిద్ధం!

ఈ రుచికరమైన తమలపాకు రైస్ లంచ్ బాక్స్‌కి కూడా అద్భుతంగా సరిపోతుంది.