Business

AP Stree Nidhi Jobs: ఏపీ స్త్రీ నిధిలో ఉద్యోగాలు.. అర్హత.. జీతం..దరఖాస్తు పూర్తి వివరాలు..

AP Stree Nidhi Jobs: ఏపీ స్త్రీ నిధిలో ఉద్యోగాలు.. అర్హత.. జీతం..దరఖాస్తు పూర్తి వివరాలు.. ఏపీ స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ నిరుద్యోగులకు సంతోషకరమైన వార్త అందించింది. 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. జులై 7 నుంచి 18 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అర్హత కలిగిన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://www.sthreenidhi.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత: దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01 జూన్ 2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000 రుసుము చెల్లించాలి.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,520 వరకు జీతం చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: మొదట ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. తర్వాత 1:4 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: అధికారిక వెబ్‌సైట్ https://www.sthreenidhi.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.