DevotionalToday Rasi Phalalu In telugu

Today horoscope:జులై 7 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి..

Today horoscope:నేడు జూలై 7, 2025, సోమవారం. చాంద్రమానాన్ని అనుసరించి ద్వాదశ రాశులకు ఈ రోజు ఎలా ఉండబోతుందో దినఫలాల ద్వారా తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ కేవలం జాతకాలను నమ్మే వారి కోసం మాత్రమే..

మేషం
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. అదృష్టం మీ వైపు ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనువైనది. ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి కష్టపడి పనిచేయండి. విజయం మీ సొంతం. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు కనిపిస్తాయి. భవిష్యత్తుకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. జీవితంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. విద్యార్థులకు ఈ రోజు శుభప్రదం. కనకధారా స్తోత్రం పఠించండి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 9

వృషభం
ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న ఒత్తిళ్లు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కోండి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున కొన్ని సవాళ్లు రావచ్చు. పట్టుదలతో వాటిని అధిగమించండి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అవసరానికి డబ్బు సమకూరుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారుల నుండి స్వల్ప ఇబ్బందులు రావచ్చు. నవగ్రహ దర్శనం, ప్రదక్షిణ చేయండి, శుభం జరుగుతుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 7

మిథునం
ఈ రోజు మంచి ఫలితాలు కనిపిస్తాయి. గ్రహబలం అనుకూలంగా ఉంది. చంద్రబలం వల్ల మనసు ఉత్సాహంగా ఉంటుంది. అన్ని విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. కీలక సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. శాంతంగా ఉండండి. బంధుమిత్రుల సహాయం లభిస్తుంది. మీ బుద్ధిబలంతో సానుకూల ఫలితాలు సాధిస్తారు. బంగారు ఆభరణాలు కొనే అవకాశం ఉంది. వారం మధ్యలో శుభవార్త వింటారు. గణపతికి గరిక సమర్పించండి, పనులు సాఫీగా సాగుతాయి.

లక్కీ కలర్: ఆకుపచ్చ
లక్కీ నెంబర్: 11

కర్కాటకం
లక్ష్య సాధనకు ఏకాగ్రత చాలా ముఖ్యం. పనిపై దృష్టి కేంద్రీకరిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయానుగుణంగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొత్త ఉత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మాటలు చెప్పే వారు మీ నిజమైన స్నేహితులు కాదని తెలుస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. స్పెక్యులేషన్‌లో పాల్గొనవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 9

సింహం
మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ప్రైవేట్ ఉద్యోగులకు ఈ రోజు మంచి ఫలితాలు ఉంటాయి. వివాదాల్లోకి వెళ్లకండి. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ రోజు శుభప్రదం. పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం, కానీ ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. సినీ, రాజకీయ రంగాల వారికి ఇది పరీక్షాకాలం. నవగ్రహ శ్లోకాలు పఠించండి, శివాలయ దర్శనం చేయండి.

లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 2

కన్య
ఈ రోజు అదృష్టం మీ వైపు ఉంటుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం చేతికి వస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించి దానిని సద్వినియోగం చేసుకోండి. విజయం మీదే. అయితే, ఒక వ్యక్తి మధ్యవర్తిత్వం ఇబ్బంది కలిగించవచ్చు. విభేదాలకు ఆస్కారం ఇవ్వకండి. అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయవద్దు. నోటిమాట ఒప్పందాలు కుదుర్చుకోవద్దు. స్పెక్యులేషన్ కలిసిరాదు. ఆరోగ్యం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

లక్కీ కలర్: బూడిద
లక్కీ నెంబర్: 7

తుల
ఈ రోజు మానసిక స్థిరత్వం అవసరం. నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. ఆత్మవిశ్వాసం కీలకం. కొన్ని సందర్భాల్లో మౌనం ఉత్తమ సమాధానమని తెలుస్తుంది. మీ పిల్లలు మీ విలువను పెంచుతారు. వారి చదువుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారులకు కొంత ఇబ్బంది కలిగవచ్చు. శివాలయ దర్శనం చేయండి, అడ్డంకులు తొలగి శుభం జరుగుతుంది.

లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 4

వృశ్చికం
శుక్రుడి అనుగ్రహం మీపై ఉంది. మీ ఆకర్షణ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్ని విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. పెట్టుబడులకు, బంగారం కొనడానికి ఈ రోజు శుభప్రదం. ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు, పదోన్నతి అవకాశాలు కనిపిస్తాయి. పిల్లల పురోగతి సంతోషాన్నిస్తుంది. కనకదుర్గకు కుంకుమ పూజ చేయించండి, శుభం కలుగుతుంది.

లక్కీ కలర్: లేత పసుపు
లక్కీ నెంబర్: 9

ధనుస్సు
ఆర్థిక లాభం ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి ఉంటుంది. కొన్ని చర్చలు విసుగు తెప్పిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగులకు అనుకూలం, కానీ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిళ్లు తప్పవు. పోలీసు శాఖలో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు ఈ రోజు మంచిది. ఒక వ్యక్తి ద్వారా బాధాకరమైన వార్త తెలుస్తుంది. విష్ణు సహస్రనామం పఠించండి, ఇబ్బందులు తొలగుతాయి.

లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 6

మకరం
ఈ రోజు చాలా అనుకూలమైనది. కొత్త పనులు ప్రారంభించడానికి శుభ సమయం. అయితే, పెద్ద పెట్టుబడుల నిర్ణయాలను వాయిదా వేయండి. మీ వాక్చాతుర్యం అందరినీ ఆకర్షిస్తుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. అప్పులు చేయవద్దు. స్పెక్యులేషన్ కలిసిరాదు. ఆరోగ్యం, జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గణపతికి చెరుకు, గరిక పూజ సమర్పించండి, శుభం జరుగుతుంది.

లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 8

కుంభం
గ్రహబలం అనుకూలంగా ఉంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితానికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనువైనది. చిన్న సమస్యలను సులభంగా అధిగమిస్తారు. భూ క్రయవిక్రయాలకు శుభప్రదం. టెక్నికల్ నైపుణ్యాలు పెంచుకోవడానికి మంచి సమయం. మిత్రలాభం ఉంది. డాక్యుమెంట్లపై సంతకాలకు ఈ రోజు అనుకూలం. అప్పులు ఇవ్వడం ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మహాలక్ష్మి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 9

మీనం
గురుబలం వల్ల ఈ రోజు మీకు తిరుగులేదు. తలపెట్టిన పనులు సఫలమవుతాయి. ఉద్యోగులకు ఈ రోజు చాలా అనుకూలం. వారం ప్రారంభంలో లభించే శుభఫలితాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. కొత్త పనులు చేపట్టడానికి ఈ రోజు శుభప్రదం. విద్యార్థులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ రోజు అనుకూలం. డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడులకు మంచి సమయం. ఒక వార్త కలవరపెడుతుంది, కానీ మనోధైర్యంతో ఎదుర్కోండి. కనకదుర్గ ఆలయంలో కుంకుమ పూజ చేయించండి, అంతా శుభం.

లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 6

గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."