Kitchen Tips:వర్షాకాలంలో పెరుగు త్వరగా తోడు కొని గడ్డలాగా రావాలంటే.. ఈ చిన్న టిప్ ఉపయోగించండి
Kitchen Tips:వర్షాకాలంలో పెరుగు త్వరగా తోడు కొని గడ్డలాగా రావాలంటే.. ఈ చిన్న టిప్ ఉపయోగించండి.. వర్షాకాలంలో గాలిలోని చల్లదనం హాయిని, విశ్రాంతిని అందిస్తుంది. అందుకే చాలామంది వర్షాకాలాన్ని ఎంతో ఇష్టపడతారు. అయితే, ఈ కాలంలో కొన్ని సమస్యలు కూడా తలెత్తుతాయి.
వాటిలో ఒకటి ఇంట్లో పెరుగు సరిగ్గా తోడు కాకపోవడం. చలికాలంలో పెరుగు తొందరగా తోడు కాకపోవడమే కాక, అది క్రీమ్ లాగా చిక్కగా రాకపోవడం మరో సమస్య.
కాలానికి తగ్గట్టు అన్నీ మారినట్లే, పెరుగు తయారీ ప్రక్రియలోనూ మార్పులు జరుగుతాయి. చలికాలంలో పెరుగు చిక్కగా, క్రీమీగా రావాలంటే కింది చిట్కాలను పాటించాలి.
ఉష్ణోగ్రత: పెరుగు చిక్కగా రావాలంటే పాల ఉష్ణోగ్రత చాలా కీలకం. కొంతమంది పాలను వేడి చేసి, ఉష్ణోగ్రత చూడకుండా తోడు పెడతారు. చలి వాతావరణం కారణంగా పాలు త్వరగా చల్లబడతాయి. కాబట్టి, పాలు గోరువెచ్చగా ఉన్నాయా అని తప్పనిసరిగా చెక్ చేయాలి.
పాత్ర: పెరుగు తోడు పెట్టే పాత్ర శుభ్రంగా, పొడిగా ఉండాలి. కొందరు పాలు కాచిన గిన్నెలోనే పెరుగు వేసి తోడు పెడతారు, ఇది పెరుగు రుచిని, వాసనను మార్చివేస్తుంది. శుభ్రమైన, పొడి గిన్నెలో పాలు పోసి తోడు పెడితే పెరుగు బాగా వస్తుంది.
పెరుగు మోతాదు: సాధారణంగా పెరుగు తోడు పెట్టడానికి కొద్దిగా పెరుగును పాలలో కలుపుతారు. కానీ, చలికాలంలో కేవలం కొంచెం పెరుగు వాడితే తోడు కావడం ఆలస్యమవుతుంది. ఒక లీటరు పాలకు 1-2 స్పూన్ల తాజా, పుల్లని వాసన లేని పెరుగును ఉపయోగిస్తే బాగా తోడుతుంది.
కలపడం: పెరుగును పాలలో వేసిన వెంటనే బాగా కలపాలి. కొందరు పెరుగును వేసి అలాగే మూత పెట్టేస్తారు, ఇది తోడు కావడాన్ని ఆలస్యం చేస్తుంది. పెరుగును పాలలో సమంగా కలిపితే చిక్కగా, ఒకే స్థాయిలో తయారవుతుంది.
ప్రదేశం: పెరుగు బాగా తోడు కావాలంటే, ఇంట్లో స్థిరమైన, కొద్దిగా వెచ్చని ప్రదేశంలో పాత్రను ఉంచాలి. చల్లని ప్రదేశంలో ఉంచితే పెరుగు తోడు కావడం ఆలస్యమవుతుంది.
ఈ చిట్కాలను పాటిస్తే చలికాలంలోనూ చిక్కని, క్రీమీ పెరుగు సులభంగా తయారవుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

