Kitchenvantalu

Chickpea Salad : ప్రోటీన్,ఫైబర్ రిచ్ “సలాడ్”.. ఇలా చేస్తే టేస్ట్‌ అదిరిపోతుంది..

Chickpea Salad : ప్రోటీన్,ఫైబర్ రిచ్ “సలాడ్”.. ఇలా చేస్తే టేస్ట్‌ అదిరిపోతుంది.. శనగలు మన వంటింట్లో తరచూ ఉపయోగించే పదార్థం. ఇవి మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. శనగలలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, అలాగే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. మాంసాహారం తినలేని వారు శనగలను తీసుకోవడం ద్వారా అవసరమైన పోషకాలను పొందవచ్చు.

శనగలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో శనగలలోని కాల్షియం సహాయపడుతుంది. అలాగే, రక్తపోటును నియంత్రించి, గుండె జబ్బులను నివారించడంలో శనగలు ఉపయోగపడతాయి.

శనగలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించి, రోగాల నుండి రక్షణ కల్పిస్తాయి. అవి చెడు కొవ్వు (LDL)ను తగ్గించడమే కాక, అధిక బరువును కూడా తగ్గించడంలో సహాయపడతాయి. శనగలతో రకరకాల వంటకాలు, సలాడ్‌లు తయారు చేసుకోవచ్చు, ఇవి రుచికరంగా ఉంటాయి. అందులో ఒకటైన శనగల సలాడ్ తయారీ విధానాన్ని, దానికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శనగల సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
శనగలు – 2 కప్పులు
పన్నీర్ ముక్కలు – 1 కప్పు
తరిగిన కీర దోస – 1 కప్పు
తరిగిన టమాట – 1 కప్పు
తరిగిన ఉల్లిపాయ – 1 కప్పు
వేయించిన పల్లీలు – ¼ కప్పు
మొలకెత్తిన పెసర్లు – ½ కప్పు
తరిగిన కొత్తిమీర – ¼ కప్పు
ఆలివ్ నూనె – 1 టీస్పూన్
నిమ్మరసం – 1 టీస్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
చాట్ మసాలా – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – ¼ టీస్పూన్
మిరియాల పొడి – ½ టీస్పూన్

శనగల సలాడ్ తయారీ విధానం:
ముందుగా శనగలను 7-8 గంటల పాటు నీటిలో నానబెట్టి, తర్వాత కుక్కర్‌లో మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. ఒక గిన్నెలో ఉడికించిన శనగలతో పాటు పైన చెప్పిన అన్ని పదార్థాలను వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల రుచికరమైన, పోషకాలతో నిండిన శనగల సలాడ్ సిద్ధమవుతుంది.

అజీర్తి సమస్య ఉన్నవారు శనగలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి శనగలు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే, శరీరంలో జీవక్రియలను మెరుగుపరచడంలో, మెటబాలిజాన్ని పెంచడంలో శనగలు గొప్పగా సహాయపడతాయి.