Devotional

Arjitha Seva tickets :శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబ‌ర్‌ నెల ఆర్జిత సేవా కోటా రిలీజ్‌ డేట్స్‌..

Arjitha Seva tickets :శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబ‌ర్‌ నెల ఆర్జిత సేవా కోటా రిలీజ్‌ డేట్స్‌.. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్ల కోటా వివరాలను ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబర్ కోటాను జూలై 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

అక్టోబర్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా వివరాలను టీటీడీ వెల్లడించింది. వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలను స్పష్టం చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబర్ కోటాను జూలై 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్‌లో నమోదు జూలై 21 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. జూలై 21 నుంచి 23 వరకు మధ్యాహ్నం 12 గంటల లోపు చెల్లింపు చేసిన వారికి లక్కీ డిప్‌లో టికెట్లు కేటాయిస్తారని వెల్లడించింది.

జూలై 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది.

జూలై 23న అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. అలాగే, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆన్‌లైన్ కోటాను జూలై 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

జూలై 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్లు, సేవలను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."