Veg Pulao :”వెజ్ పులావ్” ఇలా చేసే పొడి పొడిగా రెస్టారెంట్ లో తినట్టే ఉంటుంది
Veg Pulao :”వెజ్ పులావ్” ఇలా చేసే పొడి పొడిగా రెస్టారెంట్ లో తినట్టే ఉంటుంది.. మనం రోజూ చేసే వంటల్లో సాధారణంగా నూనెను ఉపయోగిస్తాం. ముఖ్యంగా పులావ్ వంటి వంటకాలకు నూనె ఎక్కువగా అవసరమవుతుంది. అయితే, ఒక్క చుక్క నూనె లేకుండా కూడా వెజ్ పులావ్‌ను సులభంగా, రుచిగా తయారు చేయవచ్చు. నూనె ఉపయోగించనందున ఇది చాలా ఆరోగ్యకరమైన వంటకం. ఈ వెజ్ పులావ్‌ను ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు:
బియ్యం – 2 కప్పులు
పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
పొడవుగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు – ¼ కప్పు
పాల మీగడ – 3 టీస్పూన్లు
కొబ్బరి పాలు – 4 కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
తరిగిన కూరగాయ ముక్కలు (క్యారెట్, బీన్స్, బటాణీ మొదలైనవి) – తగినన్ని
తరిగిన టమాట ముక్కలు – ¼ కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
తరిగిన పుదీనా – కొద్దిగా
మసాలా దినుసులు:
సాజీరా – ½ టీస్పూన్
లవంగాలు – 5
యాలకులు – 4
దాల్చిన చెక్క – 2 చిన్న ముక్కలు
జాజికాయ పొడి – చిటికెడు
అనాస పువ్వు – 1
వెజ్ పులావ్ తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20-30 నిమిషాలు నానబెట్టుకోవాలి.ఒక కుక్కర్ తీసుకుని అందులో మసాలా దినుసులు (సాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు) వేసి, తక్కువ మంటపై కొద్దిగా వేయించాలి.
తర్వాత పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి, నూనెకు బదులుగా 3 టీస్పూన్ల పాల మీగడ వేసి బాగా కలపాలి.ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అడుగు మాడకుండా ఉండేందుకు 1 టేబుల్ స్పూన్ నీటిని పోసి, కలిపి, మూత పెట్టి తక్కువ మంటపై 2-3 నిమిషాలు ఉడికించాలి.
5 నిమిషాల తర్వాత తరిగిన కూరగాయ ముక్కలు, టమాట ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలపాలి. మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు 4 కప్పుల కొబ్బరి పాలను (బియ్యానికి రెండు రెట్లు) పోసి, మధ్యస్థ మంటపై పాలు మరిగే వరకు ఉడికించాలి.కొబ్బరి పాలు మరిగిన తర్వాత, నానబెట్టిన బియ్యాన్ని వేసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి, మధ్యస్థ మంటపై 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, స్టవ్ ఆపేయాలి.
కుక్కర్ మూత తీసి, పులావ్‌ను ఒకసారి బాగా కలపాలి. ఇలా చేస్తే, నూనె లేకుండా రుచికరమైన వెజ్ పులావ్ సిద్ధమవుతుంది.
కొబ్బరి పాల తయారీ విధానం:
ఒక పెద్ద కొబ్బరి కాయ నుండి తీసిన కొబ్బరిని తురుముకోవాలి లేదా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి.ఈ తురుముకు వేడి నీటిని పోసి, బాగా కలిపి 30 నిమిషాలు అలాగే ఉంచాలి.శుభ్రమైన వస్త్రంలో ఈ మిశ్రమాన్ని పోసి, పాలను జారీగా వడకట్టుకోవాలి.
ఈ విధంగా ఇంట్లోనే సులభంగా కొబ్బరి పాలను తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలను పులావ్‌లో ఉపయోగించడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ విధానంలో తయారైన వెజ్ పులావ్ నూనె లేకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉంటుంది.

