Thati kallu:తాటి కల్లు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
Thati kallu:తాటి కల్లు గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. తాటి కల్లు… పల్లెటూర్లలో చాలా మంది దీన్ని తాగుతుంటారు. నీరా అని కూడా పిలిచే ఈ తాటి కల్లు, ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే, తాటి కల్లు తాగడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? దీన్ని తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
తాటి చెట్టు నుంచి కుండలోకి సేకరించిన ద్రవాన్ని తాటి కల్లు లేదా నీరా అంటారు. ఈ నీరా రుచికరంగా ఉండి, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తాటి చెట్టు నుంచి సేకరించిన 12 గంటల్లోపు దీన్ని తాగితే మంచిది, ఎందుకంటే ఆ తర్వాత అది పులిసి విషపూరితంగా మారవచ్చు.
100 ఎమ్ఎల్ తాటి కల్లులో సుమారు 75 క్యాలరీలు ఉంటాయి. ఇందులోని కార్బోహైడ్రేట్స్ సుక్రోజ్ రూపంలో ఉంటాయి, కాబట్టి షుగర్ ఉన్నవారు కూడా దీన్ని తాగవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.
పోషకాహార నిపుణులు కూడా తాజా తాటి కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. సేకరించిన వెంటనే తాగితే ఇది మత్తు లేకుండా ఉంటుంది. అయితే, సమయం గడిచే కొద్దీ కల్లులో ఆల్కహాల్ శాతం పెరుగుతుంది.
కొంతమంది కల్లు పులవకుండా ఉండటానికి దీనిలో క్యాల్షియం హైడ్రాక్సైడ్ వంటి రసాయనాలను కలుపుతారు. దీంతో ఆల్కహాల్ శాతం మరింత పెరిగి, కల్లు మత్తును కలిగిస్తుంది. ఇలా రసాయనాలు కలిసిన కల్లు తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఆల్కహాల్ శాతం ఎక్కువైన కల్లు తాగడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయం, గుండెపై తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరంలోని ఈ అవయవాలను దెబ్బతీస్తాయి. కాబట్టి, తాజా మరియు రసాయనాలు లేని తాటి కల్లును మితంగా తాగడం ఆరోగ్యానికి మంచిది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

