Business

Andhra Pradesh Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ.. వాటిని నమ్మవద్దు..

Andhra Pradesh Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ.. వాటిని నమ్మవద్దు.. ఆంధ్రప్రదేశ్‌లో తల్లి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన డబ్బులను ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందనే పుకారు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, కొందరు లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన డబ్బులను వెంటనే విత్‌డ్రా చేసుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

తల్లి వందనం పథకం ద్వారా జమ చేసిన డబ్బులను ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, ఓ వ్యక్తి తల్లి వందనం పథకంలో పెద్ద స్కామ్ జరుగుతోందని, డబ్బులను ఎక్కువ రోజులు ఖాతాలో ఉంచితే ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని ఆరోపించాడు. దీంతో, కొందరు లబ్ధిదారులు తమ ఖాతాల నుంచి డబ్బులను తక్షణం విత్‌డ్రా చేసుకుంటున్నారు.

ఈ పుకారుపై స్పందించిన ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్, తల్లి వందనం డబ్బులను తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో ఒకసారి జమ చేసిన డబ్బులను ప్రభుత్వం ఎప్పటికీ తిరిగి తీసుకోదని తెలిపింది. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలాగే, ఇటువంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఫేక్ పోస్టులను షేర్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తల్లి వందనం పథకం కింద, 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ. 15,000 సాయంలో, రూ. 13,000 తల్లి ఖాతాలో జమ చేస్తారు, మిగిలిన రూ. 2,000 పాఠశాల నిర్వహణ గ్రాంట్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలోని ఖాతాలో జమ అవుతుంది. ఒక పిల్లాడి తల్లికి రూ. 13,000, ఇద్దరు పిల్లల తల్లికి రూ. 26,000, ముగ్గురు పిల్లల తల్లికి రూ. 39,000 జమ చేస్తారు. ఈ పథకం స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ