Devotional

Tirumala Tirupati:తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన విజ్ఞప్తి.. అలా నమ్మి మోసపోవద్దు..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు టీటీడీ ఈవో జె. శ్యామలరావు పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలను సృష్టించి, భక్తులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు అడుగుతూ మోసాలకు పాల్పడుతున్నారని టీటీడీ తెలిపింది. భక్తులు ఇలాంటి నకిలీ ఖాతాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.

ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తుంటారు. అయితే, టీటీడీ ఆన్‌లైన్ సేవలను పొందేందుకు ప్రయత్నించే భక్తులను కొందరు సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని టీటీడీ నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికారిక సమాచారం కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాలని సూచిస్తోంది.

తాజాగా, గుర్తు తెలియని వ్యక్తులు టీటీడీ ఈవో జె. శ్యామలరావు పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించి, భక్తులకు సందేశాలు పంపుతూ డబ్బులు అడుగుతున్నారు. ఈ విషయం టీటీడీ దృష్టికి రాగా, ఇది పూర్తిగా మోసగాళ్ల చర్యగా గుర్తించింది. భక్తులు ఇటువంటి నకిలీ ఖాతాలకు దూరంగా ఉండాలని, సందేహాస్పద సందేశాలు వస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగం సెల్ నంబర్ 9866898630 లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004254141కు సమాచారం అందించాలని కోరింది.

భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org లేదా అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."