Makhana Payasam:టీ,కాఫీ బదులు దీన్ని రోజూ “ఒక గ్లాస్” తాగితే చాలు.. ఎంతటి నీరసం అయినా మాయం..
Makhana Payasam:టీ,కాఫీ బదులు దీన్ని రోజూ “ఒక గ్లాస్” తాగితే చాలు.. ఎంతటి నీరసం అయినా మాయం.. మఖన.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవి తెల్లగా, గోళీల సైజులో, నల్లని మచ్చలతో ఉండే గింజలు. వీటిని మఖన అని, కొందరు ఫూల్ మఖన అని కూడా పిలుస్తారు.
ఉత్తర భారతదేశంలో వీటిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మఖనతో రకరకాల వంటలు తయారు చేయవచ్చు. ముఖ్యంగా, మఖనతో చేసే పాయసం అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ పాయసం తయారీ విధానం, దానికి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మఖన పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు:
మఖన – 2 కప్పులు
సగ్గు బియ్యం – ¼ కప్పు
చిక్కటి పాలు – 1½ కప్పు
నెయ్యి – 2 టీ స్పూన్లు
యాలకుల పొడి – చిటికెడు
చక్కెర – ½ కప్పు
ఉప్పు – చిటికెడు
నీరు – 1 లీటరు
జీడిపప్పు – 2 టీ స్పూన్లు
ఎండుద్రాక్ష – 2 టీ స్పూన్లు
మఖన పాయసం తయారీ విధానం:
ముందుగా ఒక కళాయిలో మఖన గింజలను వేసి 5 నిమిషాల పాటు వేయించాలి.వేయించిన మఖనలో నాలుగో వంతు తీసుకుని, జార్‌లో వేసి మెత్తని పొడి కాకుండా, కొద్దిగా గరుకుగా ఉండేలా మిక్సీలో గ్రైండ్ చేయాలి.మిగిలిన మఖనను నీటిలో నానబెట్టాలి.
ఒక కళాయిలో నెయ్యి వేసి కాగిన తర్వాత జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేయించి పక్కన పెట్టుకోవాలి.మరో కళాయిలో 1 లీటరు నీరు పోసి, కాగిన తర్వాత సగ్గు బియ్యం వేసి ఉడికించాలి.సగ్గు బియ్యం ఉడికిన తర్వాత, పాలు, చక్కెర, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి, పాలు కాగే వరకు 15 నిమిషాలు ఉడికించాలి.
ఆ తర్వాత, గ్రైండ్ చేసిన మఖన పొడిని వేయాలి.5 నిమిషాల తర్వాత, నానబెట్టిన మఖన గింజలను వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి.చివరగా, వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్షలు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.ఇలా చేస్తే రుచికరమైన మఖన పాయసం సిద్ధం!
మఖన యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:
మఖన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు చక్కెరకు బదులు బెల్లం వాడి పాయసం తయారు చేసుకోవచ్చు. ఇది అధిక బరువును తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, మరియు శరీరానికి శక్తి, పోషకాలను అందిస్తుంది. ఈ సీజన్‌లో రోజూ ఒక గ్లాస్ మఖన పాయసం తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది, వేసవి తాపం మరియు ఎండ దెబ్బ నుండి రక్షణ కలుగుతుంది.

