Tomato Pappu:”టమాటో పప్పు”ఇలా చేయండి.. మీరు ఎప్పుడు చేసిన చాలా రుచిగా చేసేస్తారు
Tomato Pappu:”టమాటో పప్పు”ఇలా చేయండి.. మీరు ఎప్పుడు చేసిన చాలా రుచిగా చేసేస్తారు.. టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. ఇవి విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. అందుకే రోజూ ఆహారంలో టమాటాలను చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అయితే, చాలా మంది టమాటాలతో పప్పు వండుకుంటారు, కానీ రుచి సరిగా రాదని ఫిర్యాదు చేస్తుంటారు. కానీ, ఈ విధంగా టమాటా పప్పు తయారు చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. అన్నం లేదా చపాతీతో ఈ పప్పును త్వరగా తినేస్తారు. మరి, ఈ రుచికరమైన టమాటా పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం!
టమాటా పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు:
కందిపప్పు – అర కప్పు
శనగపప్పు – అర కప్పు
నీరు – 3 కప్పులు
పసుపు – అర టీస్పూన్
బిర్యానీ ఆకు – 1
దాల్చిన చెక్క – చిన్న ముక్క
నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – 1 టీస్పూన్
ఉల్లిపాయ – 1 (ముక్కలుగా తరిగినది)
టమాటాలు – 2 (ముక్కలుగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్
కారం పొడి – 1 టీస్పూన్
ధనియాల పొడి – అర టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
ఉప్పు – తగినంత
ఆమ్చూర్ పొడి – అర టీస్పూన్
ఇంగువ – చిటికెడు
ఎండుమిర్చి – 2
టమాటా పప్పు తయారీ విధానం:
కందిపప్పు, శనగపప్పును కుక్కర్లో వేసి, 3 కప్పుల నీరు పోసి, 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
స్టవ్ మీద బాణలి పెట్టి, నెయ్యి వేసి వేడి చేయాలి.
నెయ్యి వేడయ్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేగించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి.
అన్నీ వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్చూర్ పొడి వేసి కలపాలి.
ఉడికించిన పప్పును బాణలిలో వేసి, అన్నీ బాగా కలిసేలా ఉడికించి, స్టవ్ ఆపేయాలి.
ఈ టమాటా పప్పు అన్నం లేదా చపాతీతో అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పప్పును ఇష్టంగా తింటారు!

