Corn Dosa: “కార్న్ దోస” ఇలా చేస్తే ఎన్ని దోసలైన తినేస్తారు.. ఆరోగ్యానికి ఆరోగ్యం..
Corn Dosa: “కార్న్ దోస” ఇలా చేస్తే ఎన్ని దోసలైన తినేస్తారు.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మొక్కజొన్నలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా, మొక్కజొన్నలతో రుచికరమైన దోశలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ దోశలు ఆరోగ్యకరమైనవి మాత్రమే కాదు, చాలా సుస్వాదంగా కూడా ఉంటాయి. ఇప్పుడు కార్న్ దోశను ఎలా తయారు చేయాలో చూద్దాం.
కార్న్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు:
మొక్కజొన్నలు – 3 కప్పులు
ఎండుమిర్చి – 2
పచ్చిమిర్చి – 2
మినపపప్పు – ¼ కప్పు
జీలకర్ర – 1 టీస్పూన్
కరివేపాకు – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
కార్న్ దోశ తయారీ విధానం:
మొక్కజొన్నలు, మినపపప్పును ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టాలి.నానిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.ఆ పేస్ట్‌లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి, అది వేడెక్కిన తర్వాత దోశలు వేయాలి.దోశపై కొద్దిగా నూనె చల్లుకుంటూ రెండు వైపులా బాగా కాల్చాలి.వేడివేడిగా కొబ్బరి లేదా టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవాలి.ఇలా తయారు చేసిన కార్న్ దోశలు రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. టమాటా లేదా కొబ్బరి చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటాయి.

