Healthhealth tips in telugu

Tea:టీతో పాటు ఈ ఆహార పదార్ధాలను తీసుకుంటే ప్రమాదంలో పడినట్టే..

Tea:టీతో పాటు ఈ ఆహార పదార్ధాలను తీసుకుంటే ప్రమాదంలో పడినట్టే.. పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. అందుకే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు. చాలా మంది ఇష్టంగా తాగే పానీయాల్లో టీ ముందుంటుంది. ఉదయం ఒక కప్పు టీ తాగని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే, ఉదయం అయితే చాలు, టీ తాగకపోతే ఆ రోజు గడవనట్లు అనిపిస్తుందని చాలా మంది చెబుతారు.

కొందరు ఉదయం టీ తాగితే, మరికొందరు సాయంత్రం తాగుతారు. ఆఫీసుల్లో పనిచేసే వారు రోజుకు రెండు లేదా మూడు సార్లు టీ తాగుతుంటారు. అయితే, టీ తాగే సమయంలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ తాగిన వెంటనే సిట్రస్ పండ్లను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఇది గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే టీతో పాటు లేదా టీ తాగిన వెంటనే సిట్రస్ పండ్లను తీసుకోవద్దు.

పసుపు ఆరోగ్యానికి మంచిది, కానీ టీతో దీనిని కలిపి తీసుకోకూడదు. ఇది శరీరంలో ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలాగే, కొందరు టీతో స్వీట్స్ తింటారు. కానీ ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి స్వీట్స్‌తో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహ సమస్యలు తలెత్తవచ్చు.

అదేవిధంగా, టీతో పాటు పాల ఉత్పత్తులు, ముఖ్యంగా పెరుగు, జున్ను వంటివి తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ