Kitchenvantalu

Idli Karam:పక్కాకొలతలతో “ఇడ్లీ కారం పొడి” కమ్మగా 6 నెలలు పైనే నిల్వ ఉంటుంది|

Idli Karam:పక్కాకొలతలతో “ఇడ్లీ కారం పొడి” కమ్మగా 6 నెలలు పైనే నిల్వ ఉంటుంది.. మనం సాధారణంగా ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను తయారు చేసి తింటాం. ఇడ్లీలను వివిధ రకాల చట్నీలు, సాంబార్‌తో కలిపి ఆస్వాదిస్తాం.

కొందరు కారంలో గుండిగా నెయ్యి వేసుకుని ఇడ్లీలను తింటారు. అయితే, ఈ కారాన్ని ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇడ్లీ కారం తయారీకి కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానాన్ని తెలుసుకుందాం.

ఇడ్లీ కారం తయారీకి కావాల్సిన పదార్థాలు:
ఎండు మిర్చి – 15
ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
మెంతులు – 1/4 టీ స్పూన్
మినపగుళ్ళు – 2 టేబుల్ స్పూన్లు
చింతపండు – 5 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు – 5
నూనె – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
ఉప్పు – తగినంత

ఇడ్లీ కారం తయారీ విధానం:
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి, కాగిన తర్వాత ఎండు మిర్చిని వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.అదే కళాయిలో మినపగుళ్ళు వేసి, కొద్దిగా ఎర్రగా వేగే వరకు వేయించాలి.మినపగుళ్ళు వేగిన తర్వాత, అందులోనే ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

తర్వాత చింతపండు, కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు వేయించి, స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచాలి.చల్లారిన తర్వాత, ముందుగా వేయించిన ఎండు మిర్చితో సహా అన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత, జార్ మూత తీసి వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి.ఇలా చేయడం వల్ల రుచికరమైన ఇడ్లీ కారం తయారవుతుంది. ఈ కారంలో నెయ్యి కలిపి ఇడ్లీలతో తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు. అలాగే, ఈ కారాన్ని దోసెలపై చల్లుకుని కూడా తినవచ్చు.