వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ కూరగాయను అసలు వదలద్దు.. ఎందుకంటే..
వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ కూరగాయను అసలు వదలద్దు.. ఎందుకంటే.. ఈ కాయలో దాగిన అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! వర్షాకాలంలో కేవలం మూడు నెలలు మాత్రమే లభించే ఈ కూరగాయ, మన శరీరంలో అనూహ్యమైన మార్పులను తెస్తుంది.
నాన్-వెజ్‌లో లభించే పోషకాల కంటే ఎక్కువగా ఈ కూరగాయలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మార్కెట్‌లో దీనికి భారీ డిమాండ్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అసలు ఆ కూరగాయ ఏమిటి? దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బోడ కాకరకాయలో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వర్షాకాలంలో ఎప్పుడు దొరికినా తినడం వల్ల శరీర జీవక్రియలు సమర్థవంతంగా పనిచేస్తాయి, రక్తప్రసరణ మెరుగవుతుంది. ముఖ్యంగా బోడ కాకరకాయ రక్తపోటు (బీపీ), మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రిస్తుంది.
ఈ కాయలో అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇందులోని సహజ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి, కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా ఈ కాయను నిరభ్యంతరంగా తినవచ్చు.
బోడ కాకరకాయలో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును స్థిరంగా ఉంచుతాయి. అందుకే హై బీపీ ఉన్నవారు వారానికి కనీసం మూడు సార్లు ఈ కాయను తినడం మంచిది. ఇందులోని ఫ్లావనాయిడ్లు, టానిన్లు శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి, దీని వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
ఈ కాయలో విటమిన్ సి, ఐరన్, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, అయితే క్యాలరీలు చాలా తక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఒక అద్భుత ఎంపిక. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఈ కాయ చర్మం, జుట్టు అందాన్ని కూడా పెంచుతుంది. జుట్టు రాలడం, చర్మంపై ముడతలు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ అద్భుత కూరగాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యం, అందం రెండూ సొంతం చేసుకోవచ్చు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

