Jowar Pongal:షుగర్ ని బరువుని కంట్రోల్ చేసి అన్ని పోషకాలు అందించే “జొన్న పొంగలి”..
Jowar Pongal:షుగర్ ని బరువుని కంట్రోల్ చేసి అన్ని పోషకాలు అందించే “జొన్న పొంగలి”.. చిరుధాన్యాలలో ఒకటైన జొన్నలు ఆరోగ్య ప్రయోజనాలను అందించే విషయం అందరికీ తెలిసిందే.
జొన్నలను సంగటి, జావ, రొట్టె రూపంలో తయారు చేసి తింటారు. అయితే, కొందరికి ఇవి రుచికరంగా అనిపించకపోవచ్చు. కానీ జొన్నలతో పొంగల్ తయారు చేస్తే, అది చాలా మందికి నచ్చుతుంది. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. జొన్నలతో పొంగల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్నల పొంగల్ తయారీకి కావలసిన పదార్థాలు:
జొన్నల రవ్వ (లేదా దంచిన జొన్నలు) – 1 కప్పు
బెల్లం – 1 కప్పు
యాలకుల పొడి – 1/4 టీస్పూన్
జీడిపప్పు – 6
కిస్మిస్ – 6
నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, జీడిపప్పు, కిస్మిస్‌లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.అదే కడాయిలో 2.5 కప్పుల నీటిని పోసి, నీరు వేడయ్యాక జొన్నల రవ్వ వేసి మెత్తగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించాలి.
రవ్వ ఉడికిన తర్వాత బెల్లం వేసి, మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి.రవ్వ బాగా ఉడికాక, మిగిలిన నెయ్యి, యాలకుల పొడి వేసి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌లతో అలంకరించాలి.ఇలా వేడి వేడిగా జొన్నల పొంగల్ సిద్ధమవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు లేదా పైన కొద్దిగా నెయ్యి చల్లి ఆస్వాదించవచ్చు.ఈ జొన్నల పొంగల్ రుచికరంగా ఉండటమే కాకుండా, పోషకాలతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

